హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: బంగారు కొనుగోలు దారులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇటీవల రూ.1.5 లక్షల మార్క్ దిగువకు వచ్చిన 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తాజాగా మరింత కిందకు దిగి వచ్చింది. బంగారం కొనాలనుకునే వారికి కాస్తంత ఊరట కలిగిస్తోంది. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాలతో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి కారణంగా బంగారం ధరలు తగ్గుతున్నాయి
బుధవారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,49,170గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,36,740గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,49,220గా, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,36,890గా ఉంది .
మరోవైపు వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి . కిలోకు వంద రూపాయల మేర తగ్గుదల నమోదు చేశాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,64,900గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,54,900గా ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.2,64,900గా, బెంగళూరులో రూ.2,54,900గా ఉంది.