Homeఆంధ్ర ప్రదేశ్అగ్రిగోల్డ్ చెల్లింపులు...!

అగ్రిగోల్డ్ చెల్లింపులు…!

  • బాండ్ల పరిశీలన ప్రారంభం

  • తొలుత ఎన్టీఆర్ జిల్లాలో..

  • త్వరలో మిగతా జిల్లాల్లో సైతం

  • బాధితుల్లో చిగురిస్తున్న ఆశలు

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: అగ్రిగోల్డ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్. ఏళ్ల తరబడి న్యాయం కోసం నిరీక్షిస్తున్న వారికి ప్రభుత్వం చెల్లింపులు ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు డిపాజిటర్లకు న్యాయం చేయాలన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం కార్యాచరణను ప్రారంభించింది.

అందులో భాగంగా మంత్రుల ప్రత్యేక బృందం తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బాండ్ల పరిశీలనకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్హులైన డిపాజిటర్లందరికి దశలవారీగా డబ్బులు జమ చేయడమే లక్ష్యంగా యంత్రాంగం రంగంలోకి దిగింది. దీంతో బాధితుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఎంతో కొంత న్యాయం జరుగుతుందని నమ్మకం పెట్టుకుంటున్నారు.

  • అందుబాటులో ప్రత్యేక కేంద్రాలు..

చెల్లింపుల ప్రక్రియలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్టోబర్ 9 నుంచి ప్రత్యేక బాండ్ల పరిశీలన కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. విజయవాడ సమీపంలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వద్ద బాధితుల సౌకర్యార్థం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు అయ్యాయి.

ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని దినాలలో ఈ కేంద్రాలు పని చేస్తాయి. రద్దీని నివారించేందుకు మండలాల వారీగా పక్కా షెడ్యూల్ను ఖరారు చేశారు.

అక్టోబర్ 9, 10 తేదీల్లో రెడ్డిగూడెం.. 12,13 తేదీల్లో ఏ కొండూరు… 14,15 తేదీల్లో గంపలగూడెం… 16, 17 తేదీల్లో జి కొండూరు మండలాల బాధితుల బాండ్లను పరిశీలించనున్నారు. డిపాజిటర్లు, చట్టబద్ధ వారసులు, ఏజెంట్లు తమ వద్ద ఉన్న అసలు బాండ్లను తీసుకువచ్చి సంబంధిత అధికారుల బృందాలకు చూపించాల్సి ఉంటుంది.

  • పక్కాగా నిబంధనలు..

అయితే ఈ బాండ్ల పరిశీలనలో నిబంధనలను పక్కాగా పాటిస్తున్నారు. అసలు బాండ్ల రంగు జిరాక్స్ కాపీలపై అటెస్టేషన్ చేసి సమర్పించిన అనంతరం వారికి అధికారిక రసీదు అందజేస్తారు. డిపాజిటర్లు జీవించి ఉన్నట్లయితే ఆధార్, పాన్, బ్యాంక్ పాస్ బుక్ కాపీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మొబైల్ నెంబర్, ఏజెంట్ వివరాలు సమర్పించాలి.

ఒకవేళ డిపాజిటర్ మరణించినట్లయితే మరణ ధ్రువీకరణ పత్రం, నామిని గుర్తింపు పత్రాలు, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు వంటి ఆధారాలు తీసుకురావాలి. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ పక్కా ప్రణాళికతో క్షేత్రస్థాయిలో అర్హులైన అసలైన బాధితుల వివరాలు పారదర్శకంగా నమోదు కానున్నాయి.

ఎక్కడ దళారుల ప్రమేయం లేకుండా.. నేరుగా నిధులు బాధితుల ఖాతాల్లోకి చేరేలా కట్టుదిట్టమైన వ్యవస్థను రూపొందిస్తున్నారు. త్వరలో మిగిలిన జిల్లాల్లోనూ ఇదే తరహాలో ప్రత్యేక కేంద్రాల ద్వారా.. పూర్తిస్థాయి సమాచారాన్ని క్రోడీకరించి.. బాధితుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేసేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. దీంతో వారిలో ఆశలు చిగురిస్తున్నాయి.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు