Homeక్రైమ్అరోరా కాలేజీలో ఏం జ‌రుగుతోంది...! కాలేజీ హాస్ట‌ల్ విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు క‌ల‌క‌లం...

అరోరా కాలేజీలో ఏం జ‌రుగుతోంది…! కాలేజీ హాస్ట‌ల్ విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు క‌ల‌క‌లం…

యాదాద్రి, క్రైమ్‌మిర్ర‌ర్‌: యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా అరోరా క‌ళాశాల‌లోని విద్యార్థినులు ఫొటోలు, వీడియోల వ్య‌వ‌హారం ఇప్పుడు టాపిక్‌గా మారింది.ళాశాల హాస్టల్‌ మెస్‌ ఇన్‌ఛార్జి పృథ్వీ, వార్డెన్‌ రేవతి మధ్య జరిగినట్లు చెబుతున్న వాట్సాప్‌ చాట్‌ వైరల్‌గా మారింది. దీనికి తోడు కళాశాలలో జరుగుతున్న పరిణామాలపై ఓ విద్యార్థి తన తండ్రితో మాట్లాడిన ఫోన్‌ కాల్‌ వాయిస్‌ రికార్డు కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. వైరల్‌ అవుతున్న వాయిస్‌ రికార్డులో మెస్‌ ఇన్‌ఛార్జి పృథ్వీ కళాశాల విద్యార్థినుల ఫొటోలు, వీడియోల గురించి అదే కాలేజీ విద్యార్థులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. కాలేజీ అమ్మాయిల ఫొటోలు, వీడియోలు కావాలంటే చెప్పండని వారికి చెప్పినట్లుగా ఆ రికార్డుల్లో వెల్లడైంది.

క‌ళాశాల ఎదుట విద్యార్థుల త‌ల్లిదండ్రుల ఆందోళ‌న‌…

ఈ వ్యవహారం సామాజిక మాధ్య‌మంలో వైర‌ల్ కావ‌డంతో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఆగ్రహంతో కొందరు కళాశాల ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఆందోళనకారులతో మాట్లాడి వారిని సముదాయించారు. ఈ ఘటనపై భువనగిరి గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు అందినట్లు తెలిసింది. మెస్‌ ఇన్‌ఛార్జి పృథ్వీ, వార్డెన్‌ రేవతిని విడివిడిగా పిలిపించి విచారించినట్లు పోలీసులు వెల్లడించారు. వారి ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. విచారణ అనంతరం చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. ఇద్ద‌రు విద్యార్థినుల అదృశ్యం…! శంషాబాద్‌లో క‌ల‌క‌లం…
  2. హైడ్రాకు కొత్త చిక్కు…!
  3. వీడియో: భర్త బైక్‌ పార్క్‌ చేసేలోపే.. లవర్‌తో భార్య జంప్‌
  4.  సంగారెడ్డిలో విషాదం: బట్టలు ఉతికేందుకు వెళ్లి.. ముగ్గురూ మృత్యుఒడికి..!

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు