Homeతెలంగాణప‌సిడి ధ‌ర‌లు ఢ‌మాల్‌... హైద‌రాబాద్‌లో ఎంతంటే...!

ప‌సిడి ధ‌ర‌లు ఢ‌మాల్‌… హైద‌రాబాద్‌లో ఎంతంటే…!

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్:ప‌శ్చిమాసియా గ‌ల్ఫ్ దేశాల్లో ఉద్రిక్త‌లు బంగారం తీవ్ర ప్ర‌భావం చూపుతుంది. దీంతో బంగారం ధ‌ర‌లు రోజు రోజుకు త‌గ్గుతున్నాయి. డాల‌ర్ రేటు పెర‌గ‌డంతో బంగారం ధ‌ర‌లు త‌గ్గ‌డానికి కార‌ణ‌మ‌ని నిపుణులు పేర్కొంటున్నారు. యుద్దం మొద‌లు కావ‌డానికి ముందు 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.1.90 ఉండ‌గా యుద్దం మొద‌ల‌వ్వ‌గానే ఒక్క‌సారిగా ప‌త‌న‌మ‌వుతుంది..

హైదరాబాద్ లో బంగారం ధ‌ర‌లు..

గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం హైదరాబాద్ మార్కెట్‌లో ఆదివారం 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ బంగారం ధర 1,48,090 దగ్గరగా ఉండ‌గా, 22 క్యారెట్ బంగారం ధర 1,35,750 దగ్గరగా 18 క్యారెట్ బంగారం ధర 1,11,070 దగ్గర ట్రేడ్ అయింది. సోమ‌వారం 24 క్యారెట్‌‌పై 810 రూపాయలు 22 క్యారెట్‌పై 750 రూపాయలు, 18 క్యారెట్‌పై 610 రూపాయలు తగ్గింది.

కాగాసోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ బంగారం ధర 1,47,280 దగ్గర 22 క్యారెట్ బంగారం ధర 1,35,000 దగ్గర 18 క్యారెట్ బంగారం ధర 1,10,460 దగ్గర ట్రేడ్ అవుతోంద‌ని తెలిపారు. బంగారం ధ‌ర‌లు ఎప్ప‌టిక‌ప్పుడు మారుతుంటాయ‌ని బంగారం కొనేముందు అడిగి కొనుగోలు చేయాలి.

 

తాజావార్తలు