-
ములుగు జిల్లా ఫలితాల్లో ప్రథమ స్థానం
-
ఈ యేడాది 95.15 శాతం ఉత్తీర్ణత
హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల అయ్యాయి. మొత్తం 95.15 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. సీనియర్ నేత కే. కేశవరావు ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. విద్యా శాఖా కార్యదర్శి యోగితా రాణా, పాఠశాల విద్యా సంచాలకులు నవీన్ నికోలస్ తదితరులు పాల్గోన్నారు. ఎప్పటిలాగే ఈసారి కూడా ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు.
బాలికలు 96.26 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 94.07 శాతం పాసయ్యారు. పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5,28,239 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాల్లో ములుగు జిల్లా 99.30 శాతంతో అత్యధిక ఉత్తీర్ణత తో ప్రథమ స్థానం, , 89.23 శాతంతో హైదరాబాద్ జిల్లా అత్యల్ప ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 99.10 శాతం ఉత్తీర్ణత నమోదయిది. ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు 95.86 శాతం, తెలుగు మీడియంలో 89.14 శాతం, ఉర్దూ మీడియంలో 86.71 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.