Homeఆంధ్ర ప్రదేశ్జనసేన బలోపేతం పై ఫోకస్..!నేతలతో పవన్ భేటీ

జనసేన బలోపేతం పై ఫోకస్..!నేతలతో పవన్ భేటీ

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: జనసేన బలోపేతంపై పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మంగళగిరిలో శనివారం జనసేన పార్టీ నిర్మాణ సారధుల సమాచార సేకరణ కమిటీల సమావేశం నిర్వహించారు. జనసేన తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటుగా కమిటీల కీలక ప్రతినిధులు భారీగా తరలివచ్చారు. ఈ సమావేశంలో భాగంగా రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఏర్పాటు చేసిన నిర్మాణ సారధుల సమాచార కమిటీలతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశం అవుతారు. ప్రతి పార్లమెంట్ కమిటీలో 28 మంది సభ్యుల చొప్పున సాధకులు, పరిశీలకులను నియమించారు. వ్యవస్థాగతంగా పార్టీని పటిష్టం చేసేందుకు వీలుగా.. ప్రతి ఒక్క పార్లమెంట్ కమిటీ సభ్యులతో పవన్ కళ్యాణ్ విడివిడిగా భేటీ అవుతూ.. నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయి సమీకరణలపై సుదీర్ఘంగా చర్చిస్తారు.

Also Read:త‌స్మాస్ జాగ్ర‌త్త‌…. ఫ్రీ AC యోజన పేరుతో కొత్త స్కామ్.. ఒక్క క్లిక్‌తో బ్యాంక్ ఖాతా ఖాళీ…!

చేరికల కమిటీ ఏర్పాటు…

ఇప్పటికే పార్టీలో చేరికల కమిటీని ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్. 14 మందితో కూడిన ఈ చేరికల కమిటీ సీరియస్ గా పని చేయనుంది. వివిధ పార్టీల్లో ఉన్న వివాదరహిత నాయకులు, సమాజంలో తటస్థులు, నిపుణులను ఆకర్షించనుంది ఈ కమిటీ. అయితే ఇప్పుడు జనసేన బలోపేతంపై పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టడం వెనుక స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. అందుకే పార్టీని సంస్థాగతంగా, క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే పనిలో పడ్డారు. తాజాగా ఇప్పుడు నిర్మాణ సారధుల సమాచార సేకరణ కమిటీల సమావేశం నిర్వహిస్తున్నారు. పార్టీ ఫ్లేవర్ తో పాటు ఫీవర్ ను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది.

29 నుంచి సమావేశాలు…

Also Read:ఫ్రాన్స్‌లో వారణాసి అప్‌డేట్… మహేష్ మూవీ షూటింగ్ పూర్తయ్యేది అప్పుడే: రాజమౌళి

ఈసాధకుల కమిటీల సభ్యులు రాబోయే సోమవారం నుంచి తమకు కేటాయించిన పార్లమెంటు నియోజకవర్గం వర్గాల పరిధిలో విస్తృతంగా పర్యటించనున్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీ క్యాడర్ను అనుసంధానం చేస్తూ.. జనసేన క్రియాశీల కార్యకర్తలు, వీర మహిళలు, పార్టీ సభ్యత్వం కలిగిన వ్యక్తుల నుంచి నేరుగా ఆర్జీలను స్వీకరించనున్నారు. పార్టీ బలోపేతానికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి క్షేత్రస్థాయి నుంచి వస్తున్న సూచనలు, అభిప్రాయాలను ఈ కమిటీలు సేకరిస్తాయి.

Also Read:Nalgonda Family Murder Case: నలుగురిని చంపింది ఒక్కడే.. వీడిన నల్లగొండ ఫ్యామిలీ మర్డర్ కేసు మిస్టరీ!

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. ఈ సమాచార సేకరణ కమిటీలకు పవన్ కళ్యాణ్ స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు . క్షేత్రస్థాయిలో బలమైన నాయకత్వాన్ని తయారు చేయాలని.. ఎక్కడ సమన్వయం లేకుండా ప్రతీ కార్యకర్తకు అండగా నిలవాలని దిగువ శ్రేణి నాయకులకు సూచించారు. ఈ కమిటీలు ఇచ్చే నివేదికల ఆధారంగానే రాబోయే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, కూటమి వ్యూహాలు ఉంటాయని జనసేన వర్గాలు వెల్లడించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు