Homeరాజకీయంకల్కి 2898 AD పై మరోసారి అనంత శ్రీరామ్ విమర్శలు...!

కల్కి 2898 AD పై మరోసారి అనంత శ్రీరామ్ విమర్శలు…!

హైద‌రాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 AD సినిమా విడుదలైనప్పటి నుంచి భారీ విజయాన్ని అందుకుంది. విజువల్ ఎఫెక్ట్స్, కథ, నటీనటుల ప్రదర్శనకు ప్రశంసలు దక్కినా, మహాభారతంలోని కొన్ని పాత్రలను చూపించిన విధానంపై అప్పట్లోనే కొంత విమర్శలు వచ్చాయి. తాజాగా ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ మరోసారి ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అనంత శ్రీరామ్.. మహాభారతం, రామాయణం వంటి ఇతిహాసాలను సినిమా కోసం మార్చడం సరైన విధానం కాదని అన్నారు. వ్యాసుడు రాసిన మహాభారతంలో ఎలా ఉందో అలాగే చూపించాలే తప్ప, కథలోని ముఖ్యమైన సంఘటనలను మార్చకూడదని అభిప్రాయపడ్డారు. సినిమా కోసం పాత్రల గొప్పతనాన్ని పెంచే ప్రయత్నంలో అసలు కథను మార్చడం సరికాదన్నారు.

Also Read:సమంతను మళ్లీ సినిమాల్లోకి తీసుకొచ్చింది నేనే…! దర్శకుడు రాజ్ నిడిమోరు…

ముఖ్యంగా కల్కి 2898 AD లో కర్ణుడి పాత్రను చూపించిన విధానంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. మహాభారతంలో అర్జునుడు అత్యుత్తమ యోధుడిగా చెప్పబడితే, సినిమాలో కర్ణుడిని మరింత గొప్పగా చూపించడం సరైనది కాదని అన్నారు. అలాగే సినిమాలో చూపించిన కొన్ని సన్నివేశాలు అసలు ఇతిహాసంలో లేవని, అలాంటి మార్పులు ప్రేక్షకుల్లో అపోహలు కలిగించే అవకాశం ఉందని చెప్పారు. ఇంటర్వ్యూలో ఆయనను కల్కి 2 కు పాటలు రాయమంటే రాస్తారా? అని ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం ఇచ్చారు. పారితోషికం ఇస్తే పాటలు రాయడానికి సిద్ధమేనని, అయితే కర్ణుడిని అతిగా పొగిడే విధంగా పాటలు రాయమంటే మాత్రం ఒప్పుకోనని స్పష్టం చేశారు. అలాంటి సందర్భంలో దర్శకుడితో చర్చించి తన అభిప్రాయం చెబుతానని అన్నారు.

Also Read:కేత‌న్ అగ‌ర్వాల్‌హ‌త్య కేసులో సంచ‌ల‌న విష‌యాలు…! జుట్టు విష‌యం వ‌ల్ల‌నే హ‌త్యా…?

ఇది మొదటిసారి కాదు. గతంలో జరిగిన ఓ సభలో కూడా అనంత శ్రీరామ్ కల్కి 2898 ADపై ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. హిందూ ఇతిహాసాలను వినోదం కోసం మార్చడం తనకు నచ్చదని, సినిమా వ్యక్తిగానే దీనిపై బాధపడుతున్నానని అప్పుడూ వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలు అప్పట్లో కూడా సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి.కాగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 AD ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించింది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా సీక్వెల్ షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అనంత శ్రీరామ్ చేసిన తాజా వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Also Read:త‌స్మాస్ జాగ్ర‌త్త‌…. ఫ్రీ AC యోజన పేరుతో కొత్త స్కామ్.. ఒక్క క్లిక్‌తో బ్యాంక్ ఖాతా ఖాళీ…!

తాజావార్తలు