అమరావతి, క్రైమ్‌మిర్రర్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తుని ప్రాంతానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో అత్యంత కీలకంగా మారిన పెంపుడు కుక్క పోస్టుమార్టం నివేదిక తాజాగా అధికారులకు అందింది. గడిచిన నాలుగు వారాలుగా చిన్నారి మిస్సింగ్ కేసుకు సంబంధించి పోలీసులు తీవ్రంగా విచారణ సాగిస్తున్నారు. మరోవైపు ప్రత్యేక బృందాలు కూడా చిన్నారిని వెతికే ప్రక్రియను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో రెండు రోజుల క్రిందట సెర్చ్ ఆపరేషన్ ను ప్రత్యేక బృందాలు నిలిపివేశాయి. ఈ క్రమంలోనే మిస్సింగ్ కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రక్రియను చేపడుతున్నారు. ఇప్పటికే వివిధ కోణాల్లో చిన్నారి మిస్సింగ్ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లోనీ సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
Also Read:వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ గురించి WHO కీలక సూచనలు…!
గడిచిన 20 రోజులుగా చుట్టుపక్కల ప్రాంతాలను ప్రత్యేక బృందాలు జల్లెడ పట్టాయి. వందలాది మంది సిబ్బందితోపాటు గ్రామానికి చెందిన ప్రజలు కూడా ఈ సెర్చ్ ఆపరేషన్ లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎక్కడా కూడా చిన్నారి జాడ కనిపించలేదు. అదే సమయంలో ఆనవాళ్లు కూడా కనిపించలేదు. ఈ క్రమంలోనే చిన్నారితో పాటు వెళ్లినట్లు సీసీ కెమెరాలు కనిపించిన పెంపుడు కుక్క ఈ కేసులో కీలకంగా మారుతుందని పోలీసులు భావిస్తూ వచ్చారు. ఈ కార్యక్రమంలోనే పెంపుడు కుక్క చిన్నారితో వెళ్లిన మూడు రోజులు తర్వాత ఇంటికి చేరుకుంది. అప్పటికే నీరసంగా వచ్చిన కుక్కకు పోలీసులు సఫారీలు చేసి ఆ తర్వాత కోలుకునేలా చేశారు. అనంతరం పెంపుడు కుక్కకు జిపిఎస్ ఏర్పాటు చేసి మరోసారి అడవిలోకి పంపించారు. చిన్నారి ఉండే ప్రాంతానికి ఈ కుక్క వెళుతుందని అంతా భావించారు. అయితే పెంపుడు కుక్క జిపిఎస్ పెట్టుకున్న తర్వాత వెళ్లినప్పటికీ పోలీసులకు పెద్దగా ఆధారాలు లభించలేదు.
అనూహ్యంగా మృతి.. తాజాగా నివేదిక…
Also Read:Healthy Snacks: ఆఫీస్‌లో రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే.. ఈ ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను తప్పక తినండి…!
చిన్నారి మిస్సింగ్ కేసులో పెంపుడు కుక్క కీలకంగా మారుతుందని భావించిన పోలీసులకు అనూహ్యమైన పరిణామం ఎదురయింది. జిపిఎస్ మెడలో ఏర్పాటు చేసి పంపించిన మరుసటి రోజే తీవ్రమైన నీరసతో వచ్చి చనిపోయింది. కుక్క ఇంటికి వచ్చి చనిపోవడంతో అందరిలోనూ అనేక అనుమానాలు వ్యక్తుమయ్యాయి. ఏదైనా విష ప్రయోగం జరిగి ఉంటుంది అన్న అపోహలు వెంటాడాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు పెంపుడు కుక్కకు పోస్ట్మార్టం చేయించారు. తాజాగా పెంపుడు కుక్క పోస్టుమార్టం నివేదిక పోలీసులకు అందింది. ఈ కేసులో అత్యంత కీలకంగా భావించిన పెంపుడు కుక్క మరణం పై ఫారిన్షిక్ నివేదిక తో ఒక స్పష్టత వచ్చినట్టు అయిందని పోలీసు అధికారులు చెబుతున్నారు. డిహైడ్రేషన్ కారణంగానే కుక్క మృతి చెందినట్లు ఈ నివేదికలో వెల్లడయింది.
Also Read:సమంతను మళ్లీ సినిమాల్లోకి తీసుకొచ్చింది నేనే…! దర్శకుడు రాజ్ నిడిమోరు…
కుక్క శరీరంపై ఎటువంటి గాయాలు లేవని, విష ప్రయోగ ఆనవాళ్లు కూడా లేవని నివేదిక స్పష్టం చేసినట్లు తెలిసింది. మరోవైపు జ్ఞానేశ్వరి తల్లి భవాని మనోవేదనతో అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. పోస్టుమార్టం నివేదికలో ఏవైనా కీలక విషయాలు వెళ్లడవుతాయేమోనని భావించిన పోలీసులకు ఈ నివేదిక కూడా ఆస్కారం లేకుండా చేసింది. అనుమానించినట్లుగా ఏదైనా విష ప్రయోగం వంటివి జరిగితే చిన్నారిని కూడా చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వాళ్లే తీసుకుని వెళ్లి ఉంటారా అన్న అనుమానాలు నెలకొనేవి. కానీ కుక్క డిహైడ్రేషన్ కారణంగానే మృతి చెందినట్లు నివేదిక రావడంతో ఇప్పుడు పోలీసులకు చిన్నారి విషయంలో అంతుచక్కని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఈ కేసుపై ఎలా ముందుకు వెళతారు అన్నది ఆసక్తికరంగా మారింది.