హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సమాజంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనను ప్రతి ఒక్కరూ తమ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. “బాల్యం ప్రతి చిన్నారి జన్మహక్కు. చదువుకోవడం, ఆడుకోవడం, ఆనందంగా ఎదగడం, తమ కలలను సాకారం చేసుకునే అవకాశాలు పొందడం ప్రతి పిల్లవాడి సహజ హక్కు. ఆ హక్కులను హరించే బాలకార్మిక వ్యవస్థకు సమాజంలో చోటు లేకుండా చేయడం మనందరి బాధ్యత” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
Also Read:Snake Wine: సీసాలో పాము పెట్టి తాగే మద్యం… ఇదేం భయంకర ట్రెండ్?
ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, భద్రత, ఆరోగ్యకరమైన వాతావరణం, సమాన అవకాశాలు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అదే సమయంలో కుటుంబాలు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, సమాజంలోని ప్రతి పౌరుడు ఈ లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని కోరారు. బాల కార్మిక వ్యవస్థను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించకూడదని, ఎక్కడైనా చిన్నారులు పనుల్లో నిమగ్నమైనా, కనిపిస్తే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు.
Also Read:బ్రేకింగ్ న్యూస్.. ఫ్యాన్స్ ఓకే అంటేనే రాజకీయాల్లోకి ఎంట్రీ!
ఒకచిన్నారిని బాల కార్మికత్వం నుంచి బయటకు తీసుకురావడం అంటే అతనికి లేదా ఆమెకు ఒక కొత్త భవిష్యత్తును అందించినట్టేనని పేర్కొన్నారు. “పిల్లల చేతుల్లో పనిముట్లు కాదు.. పుస్తకాలు ఉండాలి. వారి భుజాలపై భారం కాదు.. భవిష్యత్తుపై ఆశలు ఉండాలి. ప్రతి చిన్నారి నవ్వుతూ, నేర్చుకుంటూ, కలలు కంటూ ఎదిగే తెలంగాణను నిర్మించడం మనందరి బాధ్యత” అని ముఖ్యమంత్రి ఒక సందేశంలో పేర్కొన్నారు.