Homeఆంధ్ర ప్రదేశ్సీఎం చంద్రబాబు పేరుతో హైటెక్ సైబర్ మోసం.. వీడియో కాల్‌ చేసి 80 వేలు కాజేత

సీఎం చంద్రబాబు పేరుతో హైటెక్ సైబర్ మోసం.. వీడియో కాల్‌ చేసి 80 వేలు కాజేత

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో : సైబర్ నేరగాళ్లు అమాయకులైన ప్రజలను దోచుకునేందుకు వినూత్న మార్గాలను ఎంచుకుంటున్నారు. ఎప్పటికప్పుడు విభిన్నమైన పందాలు అనుసరిస్తూ లక్షలాది రూపాయలు కొట్టేస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేరుతో 80,000 కాజేసిన వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ హైటెక్ సైబర్ మోసం విశాఖలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలను పరిశీలిస్తే.. విశాఖపట్నంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సైబర్ మోసం సంచలనం రేపుతోంది. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితర ప్రముఖుల పేర్లను దుర్వినియోగం చేస్తూ ఓ సైబర్ కేటుగాడు బాధితుడిని బురిడీ కొట్టించాడు. మాజీ మంత్రి దేవినేని ఉమా ఫోటోతో వాట్సాప్ ఖాతా సృష్టించి, ఏకంగా సీఎం చంద్రబాబుతో వీడియో కాల్, వాట్సాప్ కాల్ మాట్లాడిస్తున్నట్లు నమ్మించే ప్రయత్నం చేసినట్లు విశాఖకు చెందిన బాధితుడు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. విశాఖ సీతంపేటలోని భూ వివాదాన్ని పరిష్కరిస్తామని, జీవీఎంసీ కమిషనర్‌పై లంచం ఆరోపణలు నిరూపిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పి దశలవారీగా రూ.80 వేల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇంకా డబ్బులు కావాలని డిమాండ్ చేస్తుండడంతో మోసపోయినట్లు గుర్తించిన శ్రీనివాస్ రెడ్డి విశాఖపట్నం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీనివాసరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టగా సైబర్ మోసగాళ్ల పన్నాగంగా గుర్తించారు. ఈ హైటెక్ మోసానికి సంబంధించిన వివరాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రముఖుల పేర్లతో వచ్చే కాల్స్, సందేశాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

దశల వారీగా డబ్బు అప్పజెప్పిన వైనం..

తనకు న్యాయం చేస్తారని ఉద్దేశంతో బాధితుడు శ్రీనివాసరెడ్డి దశలవారీగా సైబర్ మోసగాళ్లకు డబ్బులు అప్పగించేసాడు. స్వయంగా మాజీ మంత్రి తనకు సహాయం చేస్తున్నట్లు నమ్మిన ఆయన అడిగిన ప్రతిసారి డబ్బులు చెల్లించుకున్నాడు. తను ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు సీఎంతో పాటు ఇతరులతో మాట్లాడిస్తున్నట్లు నమ్మించడం ద్వారా శ్రీనివాస్ రెడ్డి తనకు న్యాయం జరుగుతుందని భావించాడు. దీంతో ఖర్చుల నిమిత్తం అడిగిన ప్రతిసారి ఎంతో కొంత ఇవ్వడం ద్వారా ఇప్పటివరకు 80 వేల రూపాయలను సైబర్ మోసగాళ్లకు ఆయన అప్పగించేసాడు. ఇంకా డబ్బులు కావాలని డిమాండ్ చేస్తూ ఉండటంతో అప్రమత్తమైన ఆయన సైబర్ పోలీసులకు విషయాన్ని తెలియజేశాడు. ఇప్పటివరకు డబ్బులు చెల్లించిన ఎకౌంటు వివరాలు, వాట్సాప్ నెంబర్ ద్వారా సైబర్ పోలీసులు సైబర్ నేరగాడిగా గుర్తించారు. ప్రస్తుతం బాధితుడు శ్రీనివాసరెడ్డి అప్పగించిన డబ్బులను తెప్పించే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. ఈ తరహా మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖుల పేర్లతో మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ తరహా ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు. పెట్టుబడులు పేరుతో డబ్బులు డిమాండ్ చేసిన, ఓటీపీలు చెప్పాలని కోరిన, ప్రముఖుల నుంచి ఫోన్లు వచ్చాయని చెప్పిన నమ్మవద్దంటూ సైబర్ పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు