Homeతెలంగాణ విద్యుత్ ఫెన్సింగ్ ప్రాణాంతకం

 విద్యుత్ ఫెన్సింగ్ ప్రాణాంతకం

  • సుర‌క్షిత వ్య‌వ‌సాయ ప‌ద్ద‌తుల‌ను వినియోగించాలి
  • అక్ర‌మంగా ఫెన్సింగ్ వేస్తే చ‌ర్య‌లు        
  • విద్యుత్ ఎస్ ఈ గంగాధర్

పెద్దపల్లి, క్రైం మిర్ర‌ర్‌:

పంట‌ల‌నుర‌క్షించుకునే పేరుతో విద్యుత్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయ‌డం ప్రాణాంత‌క‌మ‌ని ద్దపల్లి  సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ గంగాధర్ అన్నారు.

ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌మావేశంలో మాట్లాడారు. అక్ర‌మంగా పంట‌ల చుట్టు విద్యుత్ ఫెన్సింగ్ వేయ‌డం ద్వ‌రా తీవ్ర‌మైన విద్యుత్ ప్ర‌మాదాలు సంభ‌విస్తున్నాయ‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు.

ఈ ప్రమాదాల కారణంగా గతంలో అనేక చోట్ల రైతులు, వ్యవసాయ కూలీలు, అలాగే పశువులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చోటుచేసుకున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యుత్ లైన్లకు నేరుగా లేదా అనధికారికంగా వైర్లు అనుసంధానించి ఫెన్సింగ్ చేయడం పూర్తిగా చట్టవిరుద్ధమని, ఇది అత్యంత ప్రమాదకరమైందని స్పష్టం చేశారు.

విద్యుత్ ఫెన్సింగ్ కారణంగా  మనుషులకే కాకుండా, ఆవులు, ఎద్దులు, మేకలు వంటి పశువులు కూడా విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడుతున్నాయని తెలిపారు.

అక్రమంగా విద్యుత్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించా రు.

సుర‌క్షిత ప‌ద్ద‌తులు అవ‌లంభించాలి….

అడ‌విజంతువుల నుంచి పంట‌ల‌ను ర‌క్షించుకునేందుకు సోలార్ ఆధారిత ఫెన్సింగ్, గార్డింగ్, ఇతర సురక్షిత వ్యవసాయ పద్ధతులను వినియోగించు కోవాలని ఆయన సూచించా రు.

విద్యుత్ ప్రమాదాల నివారణ కు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు .

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు