వనస్థలిపురం, క్రైమ్‌మిర్రర్: ఎపిక్ పరీక్ష రాసి నడుచుకుంటూ వస్తున్న క్రమంలో విద్యార్థిని కాడు ఢీకొట్టగా అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. వారిగ్రామంలోవిషాదం అలుము కుంది. వనస్థలిపురంలో శనివారం ఈ ఘటన జరిగింది. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ చలకుర్తికి చెందిన మైనంపాటి వల్లపురెడ్డి బధిరుడు. సెంట్రింగ్ పనులు చేస్తుంటాడు. అతడు.. భార్య ఇద్దరు కూతుర్లు అంజలి (19), పూజితలతో కలిసి మన్సురాబాద్ మల్లికార్జుననగర్ కాలనీలో ఉంటున్నాడు.
రెండో కుమార్తె పూజితకు శనివారం ఎప్‌సెట్ పరీక్ష ఉండటతో అక్క పూజితతో కలిసి ఇబ్రహీంపట్నంలోని పరీక్ష కేంద్రానికి వెళ్లారు. పూజిత పరీక్ష రాసిన తర్వాత ఇద్దరూ మధ్యాహ్నం బస్సెక్కి, వనస్థలిపురం ప్రళ్లవి గార్డెన్ వద్ద దిగారు. అక్కడి నుంచి విజయవాడ హైవే సర్వీసు రోడ్డుపై నడుచుకుంటూ ఇంటికి వెళుతుండగా అతివేగంతో దూసుకొచ్చిన ఓ కారు మరో కారును ఢీకొట్టి.. అదే వేగంతో అంజలి, పూజితలను ఢీకొట్టింది.
దీంతో తీవ్రగాయాలతో అంజలి అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన పూజితను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కారు డ్రైవర్ జవహర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడు అజాగ్రతగా కారు నడపడంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.