Homeతెలంగాణతాజ్ పూర్ లో ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత డా, బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

తాజ్ పూర్ లో ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత డా, బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

•ఘనంగా నివాళులు అర్పించిన సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్

•ముఖ్య అతిధులుగా భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ మరియు ఎస్హెచ్ఓ

క్రైమ్ మిర్రర్, ఆత్మకూరు:- యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తాజ్ పూర్ గ్రామం మంగళవారం రోజున డా, బి. ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్, పాలకవర్గం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి వారికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా స్థానిక సీఐ చంద్రబాబు,ఎస్హెచ్ఓ అనీల్ కుమార్ పాల్గొని నివాళులు అర్పించి వారి సేవలను కొనియాడారు.ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ అణగారిన వర్గాల హక్కుల కోసం, దళిత పీడిత బహుజన వర్గాల స్వేచ్ఛ కోసం వారు రచించిన రాజ్యాంగం ఎంతో గొప్పదని కొనియాడారు.ఈ కార్యక్రమంలో సామాజిక వేత్త డా, ర్యాకల శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి బి, నరేందర్, ఉపసర్పంచ్ వరిగంటి కృష్ణ, వార్డు సభ్యులు పల్లెపాటి కృష్ణ, మహ్మద్ గాలిబీ యాకుబ్, బొమ్మారపు రామక్రిష్ణ, బొమ్మారపు లక్ష్మి బాల్ రాజ్, బీట్కూరి మహేష్, వరిగంటి మానస నాగరాజు, షేక్ అహ్మద్, మరియు మాజీ సర్పంచ్లు,అన్ని కుల సంఘాల నాయకులు, యువకులు, మహిళలు, గ్రామ పంచాయతీ సిబ్బంది,గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వారికి ఘన నివాళులు అర్పించారు.

ప్రపంచవ్యాప్తంగా పట్టిపీడిస్తున్న ఫ్యాటీ లివర్ సమస్య?

Nitish Kumar: పల్టూరామ్ విమర్శలు.. ఆధునిక బిహార్ రూపశిల్పిగా ప్రశంసలు.. 10 సార్లు సీఎం అయిన నితీశ్ ప్రస్థానం ఇదే!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు