క్రైమ్ మిర్రర్,భూపాలపల్లి :- డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాజకీయ నాయకులతో పాటు వివిధ వర్గాల ప్రజలు, ట్రాన్స్ జెండర్స్ సామాజిక వర్గం కూడా చురుగ్గా పాల్గొని, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమసమాజ స్థాపన, సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ చేసిన కృషిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. సామాజిక సమానత్వం కోసం జరిగిన వేడుకల్లో ట్రాన్స్ జెండర్లతో పాటు ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు పాల్గొని అంబేద్కర్ ఆశయాలను కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సామాజిక అసమానతలను రూపుమాపి, సమానత్వం కోసం కృషి చేస్తామని ఈ వేడుకల్లో పాల్గొన్నవారు ప్రతిజ్ఞ చేశారు.
సింగల్ గానే ఉంటా.. పెళ్లిపై రామ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ప్రపంచవ్యాప్తంగా పట్టిపీడిస్తున్న ఫ్యాటీ లివర్ సమస్య?
