క్రైమ్ మిర్రర్,సినిమా న్యూస్:- ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోలు ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగల్ గానే జీవితాన్ని ముందుకు సాగిస్తున్నారు. పెళ్లి కాని హీరోల జాబితాలో ఎంతోమంది స్టార్లు ఉన్నారు. అయితే తాజాగా టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని భవిష్యత్తులో తన పెళ్లి విషయంపై ఒక క్లారిటీ ఇస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిన్నప్పటి నుంచి నాకు ఏకాంతంగా ఉండడం అలవాటువని… సింగిల్ గా ఉండడం ఎంతో ప్రశాంతతను ఇస్తుంది అని వ్యాఖ్యానించారు. కేవలం షూటింగ్స్ లో మాత్రమే సందడి ఉంటుంది. కానీ ఆ తరువాత నాకంటూ ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని ఏర్పరుచుకున్నాను అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తప్పకుండా భవిష్యత్తులో ఒక మంచి తోడు దొరికితే పెళ్లి చేసుకుంటానని.. అలా కుదరకపోతే ఒంటరిగానైనా సరే ఆనందంగా జీవితాన్ని గడుపుతాను అని హీరో రామ్ పోతినేని తన పెళ్లిపై ఒక స్పష్టత ఇచ్చారు. రామ్ పోతి నేని చెప్పిన విధంగా చూసుకుంటే భవిష్యత్తులో ఒక మంచి అమ్మాయి పరిచయమైతే తనని పెళ్లి చేసుకోవచ్చు అని అనుకుంటున్నారు. మరోవైపు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్, అనుష్క, సాయి పల్లవి.. ఇలా ఎంతోమంది స్టార్ హీరో హీరోయిన్లు ఇంకా పెళ్లి చేసుకోలేదు.
సింగల్ గానే ఉంటా.. పెళ్లిపై రామ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
By Vengal Reddy
0
21
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.
పాలిటిక్స్, టెక్నాలజీ, లైఫ్ స్టైల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
