Homeక్రైమ్నిశ్చితార్థం రద్దు.. అడ్డొచ్చిన యువతి తల్లిని నరికి చంపిన దుండగుడు

నిశ్చితార్థం రద్దు.. అడ్డొచ్చిన యువతి తల్లిని నరికి చంపిన దుండగుడు

 క్రైం మిర్రర్ : తమిళనాడులోని విరుదునగర్‌ జిల్లాలో దారణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతితో జరిగిన నిశ్చితార్థం రద్దు కావడంతో ఆగ్రహానికి గురైన వ్యక్తి యువతిపై దాడికి ప్రయంత్నించాడు. దానిని అడ్డుకోవాడానికి ప్రయత్నించిన క్రమంలో యువతి తల్లీ ప్రాణాలు కొల్పోయింది. పూర్తి వివరల్లోకి వెళితే..

32 ఏళ్ల యువరాజ్‌, 21 ఏళ్ల వర్షకు కొన్ని నెలల కిందట పెద్దలు  నిశ్చితార్థం కుదించారు. అయితే వయసులో 11 ఏళ్లు గ్యాప్ ఉండటంతో బంధువైన అతడ్ని పెళ్లి చేసుకునేందుకు ఆ యువతి నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులు నిశ్చితార్థాన్ని రద్దు చేశారు. కాగా నిశ్చితార్థాన్ని రద్దు చేశారనే కోపంతో యువతి ఇంట్లోకి చోరబడి విచక్షణారహితంగా దాడి చేశాడు. దాడిని అడ్డుకోవడానికి యువతి తల్లి జ్యోతి ప్రయత్నించింది. అయితే యువతి తల్లిపై కూడా తీవ్ర దాడి చేయడంతో సంఘటన స్థలంలోనే మరణించింది.  అతడి దాడిలో గాయపడిన వర్ష ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందితుడైన యువరాజ్‌ను అరెస్ట్‌ చేశారు. హత్యతో పాటు పలు సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌ అధికారి తెలిపారు.

also read ; పెట్రోల్ బంక్ వద్ద ఘర్షణ.. యువకుడి రెండు చేతులు నరికేసిన దుండగులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు