Homeతెలంగాణతెలంగాణలో సీఎం మార్పు?!

తెలంగాణలో సీఎం మార్పు?!

•రేవంత్ పనితీరుపై ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయ సేకరణ
•ప్రతికూలంగా వస్తే మార్పు వైపు కాంగ్రెస్ అడుగులు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో:- 

తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పుపై కాంగ్రెస్ హై కమాండ్ దృష్టి పెట్టిందా? అక్కడ సీఎం రేవంత్ ను మార్చనుందా? ఎమ్మెల్యేల అభిప్రాయం కోరుతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నట్లు ప్రచారం నడుస్తోంది. వారి నుంచి మౌఖికంగా సీఎం రేవంత్ పై అభిప్రాయం తీసుకునేందుకు ఫారాలు అందించినట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణలో సీఎం మార్పు అనివార్యం అని పొలిటికల్ వర్గాల్లో తెగ ప్రచారం నడుస్తోంది.

* పూర్తిగా స్వేచ్ఛ..
ఇప్పటివరకు కాంగ్రెస్ హై కమాండ్ రేవంత్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. ప్రత్యేక పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పిన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ఎనలేని ప్రాధాన్యం దక్కింది. అటు రేవంత్ సైతం దూకుడుగా వ్యవహరించి కాంగ్రెస్ పార్టీలో జవసత్వాలు నింపే ప్రయత్నం చేశారు. తన దూకుడుతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో పోరాట పటిమను నిలిపారు. అందుకే కాంగ్రెస్ అధినాయకత్వం ముందుగా రేవంత్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చింది. నాటి గులాబీ పార్టీపై ఆందోళనల విషయంలో పూర్తి స్వేచ్ఛ కల్పించింది. వినూత్న స్థాయిలో ఆందోళనలు, పాదయాత్రల ద్వారా తెలంగాణలో బలమైన రాజకీయ శక్తిగా కాంగ్రెస్ పార్టీని తీర్చిదిద్దారు రేవంత్ రెడ్డి. అందుకే ఆయన కష్టాన్ని గుర్తించి ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది. పార్టీలో ఎంతోమంది సీనియర్లు ఉన్నా.. వారందరినీ కాదని రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పీఠం అప్పగించింది.

* అంతర్గత ప్రజాస్వామ్యం..
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. వివిధ రాష్ట్రాల్లో తరచూ ముఖ్యమంత్రులను మార్చుతూ ఉంటుంది ఆ పార్టీ హై కమాండ్. మొన్ననే కర్ణాటకలో సిద్ధ రామయ్యను మార్చి.. డీకే శివకుమార్ కు బాధ్యతలు అప్పగించింది. అదే మాదిరిగా తెలంగాణలో సైతం మార్పు ఉంటుందన్న ప్రచారం నడిచింది. అయితే తాజాగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకుంటున్నట్లు ప్రచారం నడుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరుపై అభిప్రాయ సేకరణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఎమ్మెల్యేలు ప్రతికూలంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తే.. రేవంత్ మార్పు అనివార్యం అని ప్రచారం నడుస్తోంది తెలంగాణ పొలిటికల్ వర్గాల్లో.

* సీనియర్ల ఫిర్యాదులు..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు జాతీయస్థాయిలో సైతం తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు. కేంద్ర పెద్దలతో సైతం సఖ్యతగా మెలుగుతున్నారు. ఒకానొక దశలో తెలంగాణ పర్యటనకు విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోడీ.. తన టీమ్ లోకి ప్రత్యేకంగా ఆహ్వానించారు రేవంత్ రెడ్డిని. అప్పటినుంచి రేవంత్ పై అనేక రకాలుగా ప్రచారం నడిచింది. మరోవైపు రేవంత్ వైఖరి పై పార్టీలో సీనియర్లు ఎప్పటికప్పుడు హై కమాండ్ కు ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలుస్తోంది. రేవంత్ సొంత అజెండాతో ముందుకు వెళ్తున్నారన్నది ఆ ఫిర్యాదుల సారాంశం. ఈ క్రమంలోనే హై కమాండ్ రేవంత్ పనితీరుపై ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తోందని ప్రచారం జరుగుతుండడం విశేషం. చూడాలి మరి తెలంగాణలో ఎలాంటి మార్పులు సంతరించుకుంటాయో..

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు