Homeఆంధ్ర ప్రదేశ్హైదరాబాద్ కు పవన్!

హైదరాబాద్ కు పవన్!

•ఆపరేషన్ అనంతరం ముంబై నుంచి సొంత నివాసానికి
•నెల రోజులపాటు అధికారిక కార్యక్రమాలకు దూరం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో :- 

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో తన నివాసానికి చేరుకున్నారు. అనారోగ్యంతో ముంబైలోని కోకిల బెన్ ధీరుబాయ్ అంబానీ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందిన సంగతి తెలిసిందే. భుజానికి సంబంధించిన ఆపరేషన్ సైతం పూర్తి చేసుకున్నారు. గత కొద్దిరోజులుగా విశ్రాంతి కూడా తీసుకున్నారు. బుధవారం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ముంబై నుంచి హైదరాబాదులోని తన సొంత నివాసానికి చేరుకున్నారు పవన్ కళ్యాణ్.

* ప్రముఖుల పరామర్శ..
పవన్ కళ్యాణ్ కు ఆపరేషన్ అయిన మరుసటి రోజు ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా పరామర్శించారు. మరికొందరు మంత్రులు సైతం ముంబై వెళ్లి పవన్ కళ్యాణ్ ను పరామర్శించారు.. మంత్రి నాదెండ్ల మనోహర్ నిత్యం ఆసుపత్రి వద్ద కనిపించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పాడనవిస్ సైతం పవన్ కళ్యాణ్ ను పరామర్శించారు.

* మూడు నెలల పాటు విశ్రాంతి..
గత కొద్ది రోజులుగా భుజం నొప్పితో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ కు ఆపరేషన్ అవసరం అని భావించడంతో వైద్య నిపుణుల సూచన మేరకు ముంబైలోని ఆసుపత్రిలో చేరారు. ఈరోజు హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. వైద్యుల సూచన మేరకు ఫిజియోథెరపీ చేయించుకోనున్నారు. ఆపరేషన్ చేసిన భుజం సాధారణ స్థితికి చేరుకోవడానికి నాలుగు నెలల సమయం పట్టి అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. దీంతో నెలపాటు ఆయన పూర్తిగా విశ్రాంతిలోనే గడపనున్నారు. అధికారిక కార్యక్రమాలను సైతం రద్దు చేసుకున్నారు. ఇప్పటికే పెండింగ్ ఫైల్ అన్ని క్లియరెన్స్ చేశారు పవన్ కళ్యాణ్. నెలపాటు తన మంత్రిత్వ శాఖలకు దూరంగా ఉన్నప్పటికీ.. ఇబ్బందులు తలెత్తకుండా అందుకు తగ్గ ఏర్పాట్లు చేసి వెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ చేరుకున్న నేపథ్యంలో సందర్శకుల తాకిడి పెరగనుంది.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు