గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. చికిత్స పేరుతో డాక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడంటూ 25 ఏళ్ల యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడైన వైద్యుడిని అరెస్ట్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఇటీవల ఓ 25 ఏళ్ల యువతి అల్సర్‌కు చికిత్స కోసం అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ డాక్టర్ వ్రాజ్ పటేల్ ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించే సమయంలో అనుచితంగా ప్రవర్తించాడని బాధితురాలు ఆరోపించింది. వైద్య పరీక్షల పేరుతో తన ప్రైవేట్ భాగాల వద్ద అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
ఈ ఘటనపై బాధితురాలు అక్టోబర్ 4న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు డాక్టర్ వ్రాజ్ పటేల్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.
కోర్టులో హాజరుపరిచిన అనంతరం నిందితుడికి రిమాండ్ విధించడంతో అతడిని సెంట్రల్ జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. బాధితురాలి ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది.
also read: పుట్టినరోజు నాడే జవాన్ వీరమరణం…
