Homeఆంధ్ర ప్రదేశ్చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.. టీడీపీ నేతలకు, కార్యకర్తలకు సీఎం సూచన

చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.. టీడీపీ నేతలకు, కార్యకర్తలకు సీఎం సూచన

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా రాష్ట్రంలో జరుగుతున్న అలజడిపై స్పందించారు. వైసీపీ నేతలు అయినటువంటి అంబటి రాంబాబు మరియు జోగి రమేష్ ఇళ్లపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వైసీపీ పార్టీ ట్రాప్ లో పడితే వారికి మనకు తేడా ఉండదు అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలతో అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అలజడులు నెలకొన్నవేళ తెలుగుదేశం పార్టీ నాయకులు లేదా కార్యకర్తలు ఎవరైనా సరే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు అని హెచ్చరించారు. ప్రతి ఒక్కరు కూడా సంయమనం పాటించాలి అని సూచించారు. పుట్టుకతోనే హింస, అవినీతి, విధ్వంసం పునాదులతోనే వైసీపీ పార్టీ పుట్టింది అని సీఎం చంద్రబాబు నాయుడు వైసిపి పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అలజడులు సృష్టించేందుకు, పాపాలను పక్కదారి పట్టించేందుకే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు అని అన్నారు. కూటమి అభివృద్ధి అజెండాతోనే ముందుకు వెళుతుంది అని.. దానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి అని కోరారు.

Read also : హీరోయిన్ అనే రీజన్ తోనే నన్ను వదిలేశాడు : మృణాల్ ఠాకూర్

Read also : కాంగ్రెస్‌కు భారీ షాక్: ‘జాగృతి’ బాట పట్టిన బింగి శివాని శివకిరణ్

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు