Homeతెలంగాణచివరి ఓటు పడేవరకు అప్రమత్తంగా ఉండాలి-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

చివరి ఓటు పడేవరకు అప్రమత్తంగా ఉండాలి-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

క్రైమ్ మిర్రర్ తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చేలా చూడాలని, చివరి ఓటు పడేవరకు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు, పార్టీ నేతలకు సూచించారు.

సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో మంత్రులు మరియు టీపీసీసీ (TPCC) అధ్యక్షుడితో అల్పాహార విందు సమావేశం నిర్వహించి, ఈ ఆదేశాలు జారీ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించడానికి ప్రతి ఓటరును ఇంటి నుంచి పోలింగ్ కేంద్రం వరకు తీసుకెళ్లి, తిరిగి వారి ఇళ్లకు సురక్షితంగా చేరేలా చూడాలని ఆదేశించారు.

పోలింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని, బూత్ స్థాయిలోని పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని మంత్రులకు సూచించారు.చివరి ఓటు పడేంతవరకు ఒక్క క్షణం కూడా నిర్లక్ష్యం చేయవద్దని స్పష్టం చేశారు. ఈ ఉప ఎన్నికలో విజయం సాధించడం కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకమని, అందువల్ల పోలింగ్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు.

Also Read:కొనసాగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్..గెలుపు ఎవరిదో..?

Also Read:సంజు బర్త్డే స్పెషల్.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు స్పెషల్ ట్వీట్!

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు