Homeతెలంగాణపది ఏళ్లకే పాడైన చరికొండ - ఫిరోజ్ నగర్ బీటీ రోడ్డు… నాసిరకం పనుల పై...

పది ఏళ్లకే పాడైన చరికొండ – ఫిరోజ్ నగర్ బీటీ రోడ్డు… నాసిరకం పనుల పై ఆరోపణలు

క్రైమ్ మిర్రర్,రంగారెడ్డి:- కడ్తాల్ మండలం చరికొండ నుండి ఫిరోజ్ నగర్‌కు వెళ్లే బీటీ రోడ్డు పది సంవత్సరాల క్రితం నిర్మించబడింది. అయితే కొద్ది సంవత్సరాలకే రోడ్డు పూర్తిగా దెబ్బతిని గుంతలమయంగా మారిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు నిర్మాణ సమయంలో నాసిరకం సామగ్రి ఉపయోగించారని,పనులు సరిగా పర్యవేక్షించలేదని కాంట్రాక్టర్‌పై ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారీ వర్షాలు పడినప్పుడల్లా రోడ్డు పైభాగం ఊడిపోవడం,గుంతలు ఏర్పడటం సాధారణమైందని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం గుంతలను మట్టితో పూడ్చినప్పటికీ,ఇది తాత్కాలిక పరిష్కారమేనని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు పూర్తి స్థాయి విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి వెంటనే స్పందించి, నాణ్యమైన పనులతో కొత్త బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.ప్రజా ధనం వృథా కాకుండా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ రోడ్డు నిర్మించాల్సిన అవసరం ఉందని గ్రామస్థులు స్పష్టం చేస్తున్నారు.

YSRCP Councillor: పాముతో సమావేశానికి వచ్చిన వైసీపీ మున్సిపల్ కౌన్సిలర్‌

Lakshmi vs Kubera: సంపద సృష్టిలో ఇద్దరు దేవుళ్ల పాత్ర కీలకం

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు