Homeఆంధ్ర ప్రదేశ్అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య

కర్నూలు,క్రైమ్ మిర్ర‌ర్: పంట అనుకున్నంత దిగుబ‌డి రాక చేసిన అప్పులు తీర్చ‌లేక కౌలు రౌతు ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న‌గోనెగండ్ల మండలం బి. అగ్రహారంలో చోటు చేసుకుంది. ఆగ్ర‌హారం గ్రామానికి చెందిన రాఘ‌వేంద్ర ఆటోన‌డుపుతూ మూడెక‌రాల పొలం కౌలుకుతీసుకొనిసాగు చేస్తున్నాడు.

కాగా వ్య‌వ‌సాయ ఖ‌ర్చుల‌కు సంబంధించి ప్రైవేటు వ్య‌క్తుల వ‌ద్ద రూ.5ల‌క్షల వ‌ర‌కు అప్పు చేశాడు. చేసిన సాగులో దిగుబ‌డి రాక‌, అప్పులిచ్చిన‌వారి ఒత్తిళ్లు ఎక్కువగా కావ‌డంతో తీవ్ర మ‌నోవేద‌న‌కు గురయ్యాడు.

ఈ క్ర‌మంలో అస్ప‌రి మండ‌లంలోని దొడ‌గొండ గ్రామంలో బందువుల ఇంటికి పెళ్లికి వెళ్లి తిరుగు ప్ర‌యాణంలో బైలుప‌త్తికొండ‌-ఢీకోట‌కొండ గ్రామాల మ‌ధ్య‌ ఆటో ఆపి ప‌క్క‌నే ఉన్న‌ చెట్టుకు తాడుతో ఉరి వేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. మృతుడికి భార్య సువ‌ర్ణ‌మ్మ‌, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.

తాజావార్తలు