Homeక్రైమ్పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై కారు బోల్తా.. ఒకరికి గాయాలు

పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై కారు బోల్తా.. ఒకరికి గాయాలు

హైదరాబాద్‌లోని పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిల్లర్ నంబర్ 172 వద్ద ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది.

మెహదీపట్నం నుంచి ఆరాంఘర్ వైపు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటన సమయంలో కారులో డ్రైవర్ ఒక్కరే ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో డ్రైవర్‌కు గాయాలు అయినట్లు తెలుస్తోంది.

ప్రమాద సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. రోడ్డుపై పడిపోయిన కారును తొలగించి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు.

కారు అదుపుతప్పడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

also read: పరిగిలో గంజాయి దందాకు చెక్‌.. 1.1 కిలోల గంజాయితో ముగ్గురు అరెస్ట్‌

తాజావార్తలు