వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో కల్తీ పాల ఉత్పత్తుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో సుమారు రూ.3.48 లక్షల విలువైన కల్తీ కోవా, కలాఖండ్‌ను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. జహీరాబాద్ నుంచి తాండూరుకు కల్తీ కోవా, కలాఖండ్‌ను తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు నిఘా ఏర్పాటు చేసి రూపారామ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
అతని వద్ద ఉన్న కల్తీగా అనుమానిస్తున్న కోవా, కలాఖండ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని తాండూరు పట్టణ పోలీసులకు అప్పగించారు. స్వాధీనం చేసుకున్న సరుకును సీజ్ చేసి, ఈ వ్యవహారానికి సంబంధించి మరింత లోతుగా దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
కల్తీ పాల ఉత్పత్తుల తయారీ, రవాణా, విక్రయాల వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలోనూ విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే కల్తీ వ్యాపారానికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు మరింత ముమ్మరం చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు.
also read: పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై కారు బోల్తా.. ఒకరికి గాయాలు
