సికింద్రాబాద్, క్రైమ్ మిర్రర్: మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రవణ్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సంజీవయ్య నగర్ కు చెందిన శ్రవణ్ తన స్నేహితుడైన నిఖిల్ తో కలిసి మద్యం సేవించినట్లు పోలీసులు తెలిపారు. నిన్న రాత్రి మద్యం సేవించిన అనంతరం ఇద్దరి మధ్య మాట మాటా పెరగడంతో నిఖిల్ తన వద్ద ఉన్న కత్తితో విచక్షణ రహితంగా శ్రవణ్ పై దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మరణించాడు.
మద్యం సేవించిన మత్తులో ఈ గొడవ తలెత్తి వాగ్వాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మారేడుపల్లి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరి మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్న నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు