Homeతెలంగాణమున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ బలపడింది

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ బలపడింది

  • ఎక్కువ ఓట్లు సీట్లు సాధించుకోగలిగాం
  • కరీంనగర్, నిజామాబాద్ కైవసం చేసుకుంటున్నాం
  • బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు

హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: న్సిపల్ ఎన్నికల్లో భాజపా బలపడిందని ఎక్కువ సీట్లు, ఓట్లు సాధించామని పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏర్పాటు చేసినవిలేకరుల సమావేశంలో మాట్లాడారు. గణనీయంగా ఓట్లు సాధించామని, పలుచోట్ల సీట్లు గెలిచామని అన్నారు. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో 250 వార్డుల్లో గెలిచాం. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 6 మున్సిపాలిటీల్లో భాజపా నిలిచింది. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లు కైవసం చేసుకో బోతున్నాం. నారాయణపేట, ఆదిలాబాద్, రాయికల్‌లో మా పార్టీ అభ్యర్థులే ఛైర్మన్లు అవుతారు. ఎక్స్ అఫిషియో, స్వతంత్రుల మద్దతుతో ఛైర్మన్ పదవులు దక్కించుకుంటాం అని అన్నారు.

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు భాజపా ఆశించిన మేరకే ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో ఫలితాలు ఆశాజనకంగా రాలేదన్నారు. మొత్తం వార్డులు, డివిజన్లు కలిపి 350 సీట్లు గెలుస్తున్నాం. త్రిముఖ పోరులో భాజపాకు కొంత నష్టం వాటిల్లింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఒక డివిజన్, అశ్వారావుపేటలో ఒక వార్డు గెలిచాం. అధికార పార్టీ కాంగ్రెస్‌కు అనుకున్న సీట్లు రాక అనేక చోట్ల హాంగ్ వచ్చిందన్నారు. భాజపాను ఓడించడానికి కాంగ్రెస్, బీఆరఎస్, మజ్లీస్ కలిసి పని చేశాయని అందుకే బీఆరఎస్ ఇన్ని సీట్లు గెలవగలిగిందన్నారు. హాంగ్ వచ్చిన చోట భాజపా ఎవ్వరికీ మద్దతు ఇవ్వదు. హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో భాజపా బలంగా ఉంది. తెలంగాణ ప్రజలు భాజపాను విశ్వసిస్తున్నారు. కచ్చితంగా అధికారంలోకి వస్తాం. మేం ఎవ్వరికీ మద్దతు ఇవ్వం. కానీ మాకు ఎవరైనా మద్దతు ఇస్తామంటే తీసుకుంటాం అని రామచందర్‌రావు తెలిపారు. భవిష్యత్ ఎన్నికల్లో మరింతగా ఉత్సాహంతో పనిచేస్తామని అన్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు