-తేల్చి చెప్పిన కాంగ్రెస్ హై కమాండ్
-ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో జరగని చర్చ
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో:-
తెలంగాణ క్యాబినెట్ విస్తరణ ఉంటుందా? ఉంటే ఎప్పుడు ఉంటుంది?? ఎప్పుడు చేపడతారు? ఎందుకు జాప్యం జరుగుతోంది? పొలిటికల్ వర్గాల్లో దీనిపైనే ఆసక్తికర చర్చ నడుస్తోంది. విస్తరణ చేపట్టి అనవసరంగా పార్టీలో వివాదం తేవడం ఎందుకని ఆలోచిస్తున్నారా? లేకుంటే చివరి ఏడాది విస్తరణ చేపడతారా? అన్నది తెలియాల్సి ఉంది..
అగ్ర నేతల సమావేశం..
తాజాగా ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేతలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రభుత్వం ఏర్పాటుతున్న క్రమంలో పాలనా తీరు, ఆరోగ్యానికి పురోగతి, పార్టీ, ప్రభుత్వ మధ్య సమన్వయం పై సమగ్రంగా చర్చించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు ఇచ్చిన హామీలను వేగవంతంగా చేరువ చేయడమే కాకుండా.. గ్రేటర్ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలకు సమాయత్వం కావాలని హై కమాండ్ స్పష్టమైన మార్గదర్శకాలను అందించింది.
విస్తరణ పై ప్రచారం జరిగినా..
అయితే మంత్రివర్గ విస్తరణ పై ఎటువంటి చర్చ జరగలేదు. గత కొంతకాలంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారం జోరుగా సాగింది. అదిగో విస్తరణ.. ఇదిగో విస్తరణ అంటూ కాలయాపన జరుగుతూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలు అని ఒకసారి.. కేరళలో ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత అని మరోసారి.. ఇలా జాప్యం జరుగుతుందే తప్ప విస్తరణ జరగడం లేదు. అదిగో ఆ మంత్రిని తీసేస్తున్నారు.. ఇదిగో కొత్తవారికి అవకాశం ఇస్తున్నారు అంటూ హడావిడి తప్ప ఎటువంటి కార్యచరణ లేదు. తాజా సమావేశంలో కేవలం నామినేటెడ్ పోస్టుల విషయమై చర్చించారే తప్ప.. మంత్రివర్గ విస్తరణ విషయంలో మాత్రం ఎలాంటి సానుకూల సంకేతాలు ఇవ్వలేదు.
ఉన్నత స్థాయిలో జరిగిన ఈ చర్చలో ప్రధానంగా ఆరు గ్యారెంటీలు, రైతుల రుణమాఫీ అమలు తీరుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలోని అర్హులందరికీ అందుతున్నాయా? లేదా అనే అంశంపై సమాచారం సేకరించింది అధిష్టానం.. లోపాలు ఉంటే తక్షణం సరిదిద్దాలని ఆదేశించింది. ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల పంపిణీ తో పాటు రైతులకు అందించిన పథకాల అమలును ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని సూచించింది. ప్రభుత్వం చేసే మంచి పనులను ప్రజలకు వివరించడంలో సమాచార లోపం ఉండకూడదని.. క్షేత్రస్థాయిలో పర్యటనలను పెంచాలని మంత్రులకు, ఎమ్మెల్యేలకు స్పష్టం చేసింది. ప్రతిపక్షాలైన భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీలు చేసే రాజకీయ దాడిని తిప్పి కొట్టాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు. మరోవైపు నామినేటెడ్ పదవులు సైతం భర్తీ చేయాలని నిర్ణయించారు. కానీ కీలకమైన మంత్రివర్గ విస్తరణ పై మాత్రం ఎటువంటి చర్చ జరగలేదు.
ఇంజనీర్ల సామర్థ్యంపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు.. కేటీఆర్ తీవ్ర కౌంటర్!
