Homeతెలంగాణఇంజనీర్ల సామర్థ్యంపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు.. కేటీఆర్ తీవ్ర కౌంటర్!

ఇంజనీర్ల సామర్థ్యంపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు.. కేటీఆర్ తీవ్ర కౌంటర్!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణలో ఇంజనీరింగ్ విద్యార్థుల నైపుణ్యాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీశాయి. విద్యార్థులనుద్దేశించి సీఎం చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన టీచర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏటా 1.10 లక్షల మంది ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్నప్పటికీ, కనీసం జాబ్ అప్లికేషన్ కూడా నింపలేని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ఉద్దేశించి ‘క్రిమినల్ వేస్ట్’ అని వ్యాఖ్యానించారు.ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విద్యార్థుల సామర్థ్యాన్ని ప్రశ్నించే ముందు, సీఎం తన సొంత విద్యార్హతలను సమీక్షించుకోవాలని చురకలంటించారు. “ఆయన ఎప్పుడైనా పోటీ పరీక్ష రాశారా? ఇంటర్వ్యూకి వెళ్లారా?” అని కేటీఆర్ ప్రశ్నించారు. అంతేకాకుండా, సీఎం రేవంత్ రెడ్డిని “రియల్ ఎస్టేట్ బ్రోకర్” అని అభివర్ణిస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు.

భారీ వర్షాలతో ఊపందుకున్న వ్యవసాయ పనులు.. ఆనందంలో అన్నదాతలు!

భారీ వర్షాలతో ఊపందుకున్న వ్యవసాయ పనులు.. ఆనందంలో అన్నదాతలు!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు