Homeఆంధ్ర ప్రదేశ్అజ్ఞాతంలోకి కొడాలి నాని!.. స్థానిక ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో ప్రాసిక్యూషన్ కు అనుమతి!

అజ్ఞాతంలోకి కొడాలి నాని!.. స్థానిక ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో ప్రాసిక్యూషన్ కు అనుమతి!

  • నమోదు చేసేందుకు మరిన్ని కేసులు రెడీ
  • ఏ క్షణంలోనైనా అరెస్టు చేసేందుకు సిద్ధం

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీమంత్రి కొడాలి నాని చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగిస్తోంది. ఆయన చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. ఏ క్షణంలోనైనా ఆయన అరెస్టు జరుగుతుందన్న ప్రచారం నడుస్తోంది. అందుకే కొడాలి నాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. వైసిపి ప్రభుత్వం ఉన్నప్పుడు కొడాలి నాని చేసిన ఎన్నికల నియమావళి ఉల్లంఘన వ్యాఖ్యలు పై నమోదైన కేసుల విషయంలో.. ప్రాసిక్యూషన్కు రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. దీంతో కొడాలి నాని పై విచారణ మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా కొడాలి నాని గతంలో చేసిన కామెంట్స్, అనుచిత వ్యవహార శైలి, వివిధ ప్రభుత్వ పనుల్లో అవినీతి వంటి వాటిపై వరుసగా కేసులు నమోదు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.

 

అత్యంత వివాదాస్పదంగా…

కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కొడాలి నాని అరెస్టు ఉంటుందన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో నడిచింది. ఎందుకంటే ఆయన సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ పై సైతం టార్గెట్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా కొనసాగినప్పుడు కూడా చంద్రబాబుపై విమర్శలు దాడి తగ్గించలేదు. ఒకానొక దశలో మెగాస్టార్ చిరంజీవితో పాటు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పై వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా వ్యవహరించేవారు. నోరు తెరిస్తే బూతులు మాట్లాడే వారు. చాలా అవమానకరంగా ఉండేవి ఆయన వ్యాఖ్యలు. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి పార్టీల శ్రేణులు కొడాలి నాని అరెస్టును కోరుకున్నాయి. కానీ అలా జరగలేదు.

 

అప్పట్లో అనుచిత వ్యాఖ్యలు..

2021లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో కొంత రగడ నడిచింది.. పంచాయితీ ఎన్నికలు వాయిదా వేయాలని అప్పట్లో సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కోరారు. అందుకు అంగీకరించలేదు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్. ఈ తరుణంలో నిమ్మగడ్డ మార్పు కోసం జగన్మోహన్ రెడ్డి సర్కార్ చేయని ప్రయత్నం అంటూ లేదు. ఈ క్రమంలో పంచాయతీ ఎన్నికల నియమావళి ఉన్నప్పుడే అప్పటి మంత్రిగా ఉన్న కొడాలి నాని చంద్రబాబుతో పాటు నిమ్మగడ్డ రమేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి కొడాలి నాని పై ఫిర్యాదు వెళ్ళింది పోలీసులకు. రాష్ట్ర మంత్రిగా ఉండడంతో అప్పట్లో పోలీసులు పెండింగ్ పెట్టారు. ఇప్పుడు అదే కేసు ప్రాసిక్యూషన్కు అనుమతించడంతో కొడాలి నాని చుట్టూ ఉచ్చు బిగవడం ఖాయం.

 

వరుసగా కేసులు..

అయితే కొడాలి నాని పై ఒక్క ఆకేసు మాత్రమే కాదు. గుడివాడ నియోజకవర్గంలో జరిగిన ఇసుక, మట్టిదందా కేసు కూడా తెరపైకి రానుంది. మరోవైపు జగనన్న కాలనీలకు సంబంధించి ఇళ్ల స్థలాలకు సేకరించిన భూమిలో కూడా భారీగా అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంకోవైపు అప్పట్లో సంక్రాంతికి భారీ కెసినో, జూదం ఆటలు గుడివాడలో కొడాలి నాని కనుసన్నల్లో జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. వాటిపై సైతం కేసులు మళ్లీ మొదలయ్యే అవకాశం ఉంది. వివేకాకుండా కొడాలి నాని అనుచరుల ఆగడాలపై కూడా కేసులు నమోదు చేస్తారని ప్రచారం నడుస్తోంది. మొత్తానికైతే కొడాలి నాని చుట్టూ ఇప్పుడు వివాదాలు, కేసులు ముసురుకోవడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు