Homeజాతీయంబిజెపితో సమాజ్ వాది రాజీ!.. బెంగాల్, మహారాష్ట్ర పరిణామాలతో మేల్కొన్న అఖిలేష్ యాదవ్!!

బిజెపితో సమాజ్ వాది రాజీ!.. బెంగాల్, మహారాష్ట్ర పరిణామాలతో మేల్కొన్న అఖిలేష్ యాదవ్!!

  • మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డి లిమిటేషన్ బిల్లుకు మద్దతు
  • వచ్చే నెలలో మరోసారి పార్లమెంట్ ముంగిటకు ఆ రెండు బిల్లులు

క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్ : భారతీయ జనతా పార్టీ జాతీయస్థాయిలో ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్తోంది. 2029 సార్వత్రిక ఎన్నికలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అందుకే కాంగ్రెస్ పార్టీని, ఇండియా కూటమిని నిర్వీర్యం చేయాలని చూస్తోంది. ఇప్పటికే బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని అస్తవ్యస్తం చేసింది. అడ్డగోలుగా చీల్చేసింది. తర్వాత మహారాష్ట్రలో ఉద్దవ్ శివసేనను సైతం ఇబ్బంది పెట్టింది. మరోవైపు శరద్ పవర్ ఎన్సీపీని సైతం చీల్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇదంతా మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి అని స్పష్టమవుతోంది.

జై కొట్టిన అఖిలేష్..

భారతీయ జనతా పార్టీ తదుపరి లక్ష్యం ఏంటంటే ఉత్తరప్రదేశ్ సమాజ్వాది పార్టీ అని తెలుస్తోంది. అయితే ఇప్పటికే డిలిమిటేషన్కు జై కొట్టారు అఖిలేష్ యాదవ్. దీంతో ఆయన జోలికి బిజెపి వెళ్లే అవకాశం లేదు. ఇండియా కూటమిలో అతిపెద్ద రెండో పార్టీ అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాది పార్టీ. ఆ పార్టీకి 37 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు. అయితే బిజెపి నుంచి ఎదురయ్యే ఈ ప్రమాదాన్ని ముందుగానే గుర్తించారు అఖిలేష్ యాదవ్. అందుకే నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు తాము మద్దతు ఇస్తామని బాహాటంగానే ప్రకటించారు అఖిలేష్ యాదవ్.

ఆ బిల్లు వీగిపోవడంతో..

గత నెలలోనే పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లుతోపాటు డీ లిమిటేషన్ బిల్లును పెట్టారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లుతో ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం జరగదని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అయినా సరే కాంగ్రెస్ మిత్రపక్ష పార్టీలు అంగీకరించలేదు. మూడింట రెండు వంతుల సభ్యులు బిజెపితో పాటు ఎన్డీఏకు లేకపోవడంతో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయింది. దీంతో పునర్విభజన బిల్లును సైతం వెనక్కి తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వానికి ఇదో సవాలుగా మారింది. అందుకే ఆపరేషన్ లోక్సభ సభ్యులు అన్నట్టు బిజెపి ప్రయత్నాలు మొదలు పెట్టింది. అందులో కొంత వరకు సక్సెస్ అయ్యింది కూడా. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ పార్టీ 29 మంది ఎంపీలను గెలుచుకుంటే.. అందులో 20 మందికి పైగా వేరు శిబిరం పెట్టి ఎన్డీఏకు మద్దతు తెలిపారు. మహారాష్ట్రలో సైతం ఎన్డీఏకు ఏకపక్షంగా ఎంపీలు మద్దతు తెలుపుతున్నారు. దీంతో వచ్చే నెలలోనే మరోసారి మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డి లిమిటేషన్ బిల్లు పెట్టేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే బెంగాల్ తో పాటు మహారాష్ట్రలో జరిగిన పరిణామాలతో అఖిలేష్ యాదవ్ బిజెపితో రాజీ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఆ రెండు బిల్లులకు మద్దతు ఇస్తానని చెప్పడంతో బిజెపి సమాజ్వాది పార్టీ జోలికి వెళ్లే పరిస్థితి లేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు