విజయవాడ, క్రైమ్ మిర్రర్: ఇప్పటివరకు ఐటీ రంగం అత్యధిక ఉద్యోగాలను కల్పిస్తోంది. ఏపీ సరికొత్త మైలురాళ్లు అందుకునేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే గూగుల్ నుంచి మొదలు పెడితే పెద్దపెద్ద కంపెనీల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయి. భారీగా కార్యకలాపాలను సాగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే ఇక్కడితోనే ఏపీ పారిశ్రామిక ప్రస్థానం ఆగిపోవడం లేదు. అంతకుమించి అనేలాగా ఏపీ మంత్రి నారా లోకేష్ అడుగులు వేస్తున్నారు.చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఐటీ రంగానికి విశేషమైన ప్రాధాన్యం ఇచ్చారు. పెట్టుబడులు పెట్టే విధంగా కంపెనీలకు ప్రోత్సాహకాలు కల్పించారు. ఆయన కల్పించిన స్వేచ్ఛాయుతమైన వాణిజ్య విధానం నేడు హైదరాబాద్ నగరాన్ని మన దేశానికి రెండవ ఐటి రాజధానిగా చేసింది.విభజిత ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఐటీ రంగానికి విశేషమైన ప్రాధాన్యం ఇస్తున్నారు చంద్రబాబు.
ఈ క్రమంలో దేశీయంగా పేరుపొందిన కంపెనీలు పెట్టుబడులు పెట్టే విధంగా రూపకల్పన చేస్తున్నారు. గూగుల్ నుంచి మొదలు పెడితే టిసిఎస్ వరకు పెద్ద పెద్ద కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఐటీరంగం తీవ్రంగా ప్రభావితం అవుతుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియడం లేదు ఈ నేపథ్యంలో కొత్త ఆలోచన చేశారు ఏపీ మంత్రి నారా లోకేష్. తన తండ్రి మాదిరిగానే వినూత్నంగా ఆలోచించి.. ఏపీ రాష్ట్రానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు సుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు.నారా లోకేష్ ప్రస్తుతం రష్యాలో పర్యటిస్తున్నారు.
అక్కడ అనేక రకాల కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు. ఏపీలో ఉన్న పరిస్థితుల గురించి.. పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న విధానాల గురించి వెల్లడించారు. ఇక్కడితోనే నారా లోకేష్ ఆగిపోలేదు. ఏకంగా స్పేస్ పాలసీ గురించి వెల్లడించారు. తమ రాష్ట్రానికి స్పేస్ పాలసీ అనేది ఒకటి ఉందని.. తద్వారా రెండు ప్రత్యేకమైన స్పేస్ సిటీలను ఏర్పాటు చేస్తున్నామని నారా లోకేష్ వివరించారు.రష్యాలోని ఎస్పీఐఎఫ్ వేదికగా జరుగుతున్న సదస్సులో ఆయన మాట్లాడారు.. స్పేస్ సిటీల ద్వారా 25వేల కోట్ల పెట్టుబడులు.. 5000 మందికి ప్రత్యక్షంగా.. 30 వేల మందికి పరోక్షంగా ఉద్యోగాలు అందిస్తామని ఆయన ప్రకటించారు..
అంతరిక్షంలో ప్రయోగాలు చేసే వాహనాలకు సంబంధించిన అసెంబ్లింగ్.. ఉపగ్రహాల తయారీ.. ఇతర పరికరాల కోసం తిరుపతి సమీపంలో దాదాపు 2,800 ఎకరాల విస్తీర్ణంలో స్పేస్ సిటీని ఏర్పాటు చేస్తున్నామని నారా లోకేష్ వివరించారు.ఇప్పటికే రాయల్ ఎన్ఫీల్డ్ యలసీమలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. కియా పరిశ్రమ రాయలసీమ ముఖ చిత్రాన్ని మార్చేసింది. ఇంకా అనేక రకాల పరిశ్రమలు రాయలసీమలో ఏర్పాటు కాబోతున్నాయి. ఇప్పుడు స్పేస్ సిటీ ద్వారా రాయలసీమలో ప్రధాన పట్టణమైన తిరుపతికి సరికొత్త గుర్తింపు రానుంది. ఆధ్యాత్మిక ప్రాంతంగా ప్రపంచ స్థాయి పేరు తెచ్చుకున్న తిరుపతి.. ఇప్పుడు పారిశ్రామికపరంగా కూడా సరికొత్తగా గుర్తింపును అందుకోనుంది.పారిశ్రామికంగా ఒక
రాష్ట్రం బాగుంటే పెట్టుబడులు బాగా వస్తాయి. ఆ రాష్ట్రానికి గ్లోబల్ గుర్తింపు తీసుకొస్తే పెట్టుబడులకు ఇబ్బంది ఉండదు. అందువల్లే నారా లోకేష్ దూకుడు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఆయన విదేశాలలో పర్యటిస్తూ.. పెద్దపెద్ద కంపెనీల ప్రతినిధులతో మాట్లాడుతూ.. వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించే విధంగా ఒప్పిస్తున్నారు. గతంలో దావోస్ లో పర్యటించిన నారా లోకేష్.. అనేక కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు. ఎం ఓ యు లు కుదుర్చుకున్నారు. ఫలితంగా ఆ కంపెనీలు ఏపీ రాష్ట్రంలో పెట్టుబడులు డుతున్నాయి.ఇటీవల రాయల్ ఎన్ఫీల్డ్ వంటి కంపెనీ ఏపీలో పెట్టుబడులు పెట్టింది.
రాయలసీమలో వాహనాల తయారీని చేపడుతోంది. గతంలోని రాయలసీమ ప్రాంతంలో కియా పరిశ్రమ ఏర్పాటు అయింది. ఇప్పుడు నారా లోకేష్ రష్యాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆ దేశ వ్యాపారవేత్తలతో సమావేశం అయ్యారు. మైక్రో ఎలక్ట్రానిక్స్ విభాగంలో పేరుపొందిన ఎలిమెంట్ గ్రూప్.. అల్యూమినియం ఉత్పత్తులు తయారుచేసే రూసాల్.. కెమికల్ ఉత్పత్తులు తయారుచేసే రస్కేమ్వంటి కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. తమ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని వారిని ఆహ్వానించారు.వారితో సుదీర్ఘ సమయం సమావేశం నిర్వహించిన లోకేష్.. ఏపీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి
ఉన్న అనుకూలమైన పరిస్థితుల గురించి వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడిల ప్రోత్సాహక అనుమతుల గురించి వివరించారు. ఆ తర్వాత మాస్కో ట్రాన్స్పోర్ట్స్ డెవలప్మెంట్ సెంటర్ ను లోకేష్ సందర్శించారు. అక్కడి రవాణా వ్యవస్థ నిర్వహణపై స్థానిక అధికారులను ప్రశంసించారు. ఏపీ రాష్ట్రంలో కూడా ఇటువంటి విధానాన్ని అమలులోకి తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు.