Homeఅంతర్జాతీయంయుద్ధం దిశగా అమెరికా అడుగులు.. చివరి క్షణంలో వెనక్కి తగ్గిన ట్రంప్.!

యుద్ధం దిశగా అమెరికా అడుగులు.. చివరి క్షణంలో వెనక్కి తగ్గిన ట్రంప్.!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : గడచిన కొద్ది నెలలుగా అమెరికా – ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతోంది. ఇరుదేశాల మధ్య యుద్ధ విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ పూర్తిస్థాయిలో యుద్ధ ముగింపు వాతావరణం కనిపించడం లేదు. అయితే ఇరుదేశాల మధ్య యుద్ధ విరమణకు సంబంధించి ఒప్పందం జరగడంతో ప్రపంచమంతా ఆనందాన్ని వ్యక్తం చేసింది. హార్ముజ్ జల సంధి వద్ద సాధారణ పరిస్థితులు నెలకొనడంతో అనేక దేశాలకు ఎగుమతులు సాఫీగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు ఇరాన్ తో శాంతి చర్చలు జరుగుతుండగానే మరోవైపు వైట్ హౌస్ లో యుద్ధం పై అత్యంత కీలక సమావేశం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ పై మరోసారి భారీ స్థాయిలో సైనిక దాడులు చేసి.. ఈసారి కథ ముగించేయాలనే అంశంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన అత్యున్నత రక్షణ అధికారులతో సుదీర్ఘంగా చర్చించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తాజాగా సంచలన కథనాన్ని ప్రచురించింది.

అయితే చివరి క్షణంలో ట్రంప్ యూ టర్న్ తీసుకున్నట్లు ఆ కథనం వెల్లడించింది. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం ట్రంప్ ఇటీవల రక్షణ కార్యదర్శి పిట్ హెగ్ సేత్, జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ డాన్ కెన్ తో అధ్యక్ష భవనంలో పలు దఫాలుగా సమావేశాన్ని నిర్వహించారు. ఇరాన్ తో కొనసాగుతున్న అణు చర్చలను విరమించి, మళ్లీ పెద్ద ఎత్తున వైమానిక దాడులు ప్రారంభించే అంశంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంలో పేర్కొంది. అమెరికా రక్షణ వర్గాలను కొంతమంది అధికారులు ఈ ఆపరేషన్ ను ఫినిష్ ది జాబ్ గా అభివర్ణించినట్లు సమాచారం. గత సైనిక చర్యలతో ఇరాన్ సైనిక సామర్థ్యం దెబ్బతిన్న నేపథ్యంలో మిగిలిన మౌలిక సదుపాయాలను పూర్తిగా ధ్వంసం చేసి యుద్ధానికి ముగింపు పలకాలని వారు సూచించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ట్రంప్ మాత్రం తుది ఆమోదం ఇవ్వలేదని, కాబట్టి చివరి నిమిషంలో భారీ దాడుల నిర్ణయం నిలిచిపోయినట్లు తెలుస్తోంది.

దౌత్య చర్చలు విఫలమవుతాయనే ఉద్దేశంతో వెనక్కి..

మరోసారి భారీ యుద్ధానికి దిగితే ఇరుదేశాల మధ్య జరుగుతున్న దౌత్యపరమైన చర్చలు దెబ్బతింటాయన్న ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని ట్రంప్ వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ అను కార్యక్రమాన్ని చర్చల ద్వారానే నియంత్రించడం మంచిదని ఆయన అభిప్రాయపడటంతో యుద్ధంపై పునరాలోచన చేశారు. దీంతో ఆయన చెప్పింది కూడా సబబేనని అధికారులు భావించినట్లు సదరు వార్త కథనంలో విశ్లేషించారు. అయితే యుద్ధం పూర్తిగా తప్పిపోయిందని భావించే పరిస్థితి లేదని అమెరికా వర్గాలు చెబుతున్నాయి. ఇరాన్ తాత్కాలిక ఒప్పందాన్ని ఉల్లంఘించిన లేదంటే అమెరికా బలగాలపై దాడులకు పాల్పడిన, పరిమిత స్థాయి సైనికు దాడులు చేపట్టేందుకు ట్రంపు సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన మిలటరీ ఆపరేషన్ను పూర్తిగా పక్కన పెట్టలేదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ట్రంప్ దౌత్య చర్చలకే ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ పరిస్థితులు మారితే మరోసారి భారీ సైనిక చర్యలు వెనకాడ బొమ్మ అనే సంకేతాలను కూడా ఇస్తున్నట్లు అమెరికా నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఇరాన్ – అమెరికా ఉద్రిక్తత తాత్కాలికంగా తగ్గినట్టే కనిపిస్తున్నా యుద్ధ మేఘాలు మాత్రం ఇంకా పూర్తిగా తొలగిపోలేదని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు