Homeతెలంగాణఉస్మానియా ఆసుప‌త్రి ఘ‌న‌త‌....! రోగికి ఐదు అవ‌య‌వాల మార్పిడి....

ఉస్మానియా ఆసుప‌త్రి ఘ‌న‌త‌….! రోగికి ఐదు అవ‌య‌వాల మార్పిడి….

హైద‌రాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (OGH) వైద్యులు దేశంలోనే అరుదైన ఘనతను సాధించారు. ఒకే రోగికి ఒకేసారి ఐదు అవయవాల (మల్టీ-విసెరల్) మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాకుండా, భారత ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఇలాంటి క్లిష్టమైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు ఈ శ‌స్ర్త చికిత్స తెలంగాణ‌కు గ‌ర్వ‌కార‌ణం. దేశంలోనే ఎవ‌రు చేయ‌ని విధంగా రోగికి ఒకే సారి ఐదు శ‌స్ర్త చికిత్స చేసి ఐదు అవ‌యాలు మార్పిడి చేసి ఉస్మానియా డాక్టర్లు సరికొత్త మైలురాయిని అందుకున్నారు. ప్రభుత్వ వైద్యుల ప్రతిభకు.. రోగుల ఆరోగ్యం పట్ల వారికి ఉన్న అంకితభావానికి నిలువెత్తు నిదర్శనంగా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నిలిచింది.

Also Read:యుద్ధం దిశగా అమెరికా అడుగులు.. చివరి క్షణంలో వెనక్కి తగ్గిన ట్రంప్.!

రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన 30 ఏళ్ల ఇంజినీర్ అరుదైన జీర్ణాశయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ, చాలా కాలంగా సాధారణ ఆహారం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. అనేక ఆస్పత్రుల్లో చికిత్స పొందినప్పటికీ ఫలితం లేకపోవడంతో, చివరకు ఉస్మానియా ఆస్పత్రిలో చేరి జీవందాన్ అవయవ దాన కార్యక్రమం ద్వారా దాత కోసం వేచి చూశాడు. 35 ఏళ్ల బ్రెయిన్‌డెడ్ మహిళ కుటుంబం అవయవదానానికి అంగీకరించడంతో, వైద్యులు కడుపు (Stomach), డ్యూడినమ్, ప్యాంక్రియాస్, చిన్నపేగు, పెద్దపేగు (రైట్ కోలన్) అనే ఐదు అవయవాలను ఒకేసారి మార్పిడి చేశారు. ఈ అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స దాదాపు 36 గంటల పాటు నిరంతరంగా సాగింది.

Also Read:తెలంగాణ పాలిటిక్స్‌లో ‘11 AM’ హైటెన్షన్.. ‘సై’ అంటే ‘సై’ అంటున్న కాంగ్రెస్ – బీఆర్ఎస్!!

శస్త్రచికిత్సకు శస్త్రచికిత్స గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాధిపతి డాక్టర్ చి. మధుసూదన్ నేతృత్వం వహించగా, అనస్థీషియా, క్రిటికల్ కేర్, నర్సింగ్ తదితర విభాగాలకు చెందిన నిపుణుల బృందం సమన్వయంతో పనిచేసింది. ప్రస్తుతం రోగి వెంటిలేటర్‌ నుంచి బయటపడి, లుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.ఈ విజయంపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వైద్య బృందాన్ని అభినందిస్తూ, తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రులు ప్రపంచస్థాయి వైద్య సేవలు అందించగల సామర్థ్యాన్ని మరోసారి నిరూపించాయని పేర్కొన్నారు. ఈ చికిత్సను ఆరోగ్యశ్రీ పథకం కింద రోగికి ఉచితంగా అందించారు.

Also Read:త‌మిళ‌నాడులో సంచ‌ల‌నం…! టీవీకే ఎమ్మెల్యేల‌కు 35 కోట్ల ఆఫ‌ర్‌…

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు