Homeవైరల్బాలయ్య సినిమాకి భారీ ట్విస్ట్..!

బాలయ్య సినిమాకి భారీ ట్విస్ట్..!

  • బాలయ్య సినిమాకి భారీ ట్విస్ట్..!

  • హీరోనే విలన్‌గా మారుతున్నాడా?

  • NBK112లో విలన్‌గా రాజశేఖర్ ఎంట్రీ!

Crime Mirror,Cinema Latest Updates: టాలీవుడ్‌లో ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్న హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. వరుస హిట్స్‌తో మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటూ సూపర్ ఫామ్‌లో దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

ప్రస్తుతం బాలయ్య, డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ పక్కా మాస్ ఎంటర్‌టైనర్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత వెంకట్ సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా దసరా లేదా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.

ఇదిలా ఉండగా, మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్‌కు కూడా బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. ఈ కాంబినేషన్ కోసం అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నారు.

గతంలో కొరటాల శివ కథ అందించిన ‘సింహా’ చిత్రం బాలయ్య కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో బాలయ్య మాస్ ఇమేజ్‌ను అద్భుతంగా చూపించారు. ఇప్పుడు మళ్లీ అదే రేంజ్‌లో సినిమా వస్తుందనే అంచనాలు పెరిగాయి.

ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ‘NBK 112’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనుంది. ఇక ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం సీనియర్ హీరో రాజశేఖర్‌ను ఎంపిక చేసినట్టు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

రాజశేఖర్ ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్‌లో భాగంగా ‘ఎక్స్ట్రా’, ‘బైకర్’ వంటి సినిమాల్లో కనిపించారు. అయితే, ఆయనకు పెద్ద బ్రేక్ మాత్రం రాలేదు. ఇప్పుడు బాలయ్య సినిమాలో విలన్‌గా నటిస్తే, ఆయన కెరీర్‌కు మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మొత్తానికి, బాలయ్య-కొరటాల కాంబోలో సినిమా సెట్స్ పైకి వెళ్లడం ఖాయం కావడంతో, ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు