Homeతెలంగాణఉచిత పథకాలపై మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసిన వెంకయ్య నాయుడు

ఉచిత పథకాలపై మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసిన వెంకయ్య నాయుడు

క్రైమ్ మిర్రర్,హైదరాబాద్:- ప్రభుత్వాలు అందిస్తున్న ఉచిత పథకాలపై మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు మరోసారి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఉచితాలకు బదులుగా విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు, రవాణా వంటి మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని ఆయన సూచించారు.గురువారం హైదరాబాద్‌లోని ఒక ఆసుపత్రి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఉచితాలను నియంత్రించడానికి అన్ని రాజకీయ పార్టీలు ఒక వేదికపైకి వచ్చి చర్చించి, ఏకాభిప్రాయానికి రావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.మౌలిక సదుపాయాల కల్పన ద్వారా మాత్రమే దేశం నిజమైన అభివృద్ధి సాధిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే, నేటి ఉరుకుల పరుగుల జీవితంలో తల్లిదండ్రులు తమ పిల్లలతో సమయం గడపాలని, వారి భవిష్యత్తు కోసం అది చాలా ముఖ్యమని ఆయన సూచించారు.

సినిమాల్లోకి రాకపోతే ట్రాక్టర్ నడుపుకునేవాడిని : ప్రభాస్ శ్రీను

అల్లు అర్జున్ రాజకీయ ప్రవేశంపై పుకార్లు.. మేనేజర్ క్లారిటీ!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు