Homeక్రైమ్బస్టాండ్‌లో ఘోర విషాదం.. రెండు బస్సుల మధ్య నలిగి మహిళ మృతి

బస్టాండ్‌లో ఘోర విషాదం.. రెండు బస్సుల మధ్య నలిగి మహిళ మృతి

క్రైం మిర్రర్ : ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ బస్టాండ్‌లో జరిగిన ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బస్సు ఎక్కేందుకు వెళ్తున్న 32 ఏళ్ల మహిళ రెండు ఆర్టీసీ బస్సుల మధ్య ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయింది. ఖేతుయ్ గ్రామానికి చెందిన నేహా సింగ్ ఓ ప్రైవేట్ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. కంపెనీ అధికారిక సమావేశం కోసం బుధవారం ఉన్నావ్ జిల్లాలోని బాంగర్‌మౌకు వెళ్లేందుకు ఆమె హర్దోయ్ బస్టాండ్‌కు చేరుకున్నారు.

బస్సు ఎక్కేందుకు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో హర్దోయ్, కన్నౌజ్ డిపోలకు చెందిన రెండు బస్సుల డ్రైవర్లు ఒకేసారి బస్సులను ముందుకు కదిలించినట్లు సమాచారం. దీంతో రెండు బస్సుల ముందు భాగాల మధ్య నేహా ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనను గమనించిన స్థానికులు, ప్రయాణికులు వెంటనే ఆమెను సమీపంలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, డ్రైవర్ల నిర్లక్ష్యంపై విచారణ కొనసాగుతోంది. ఈ విషాద సంఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

also read :“30 వేల అడుగుల ఎత్తులో షాక్.. ఒకేసారి ముగ్గురు పైలట్లకు అస్వస్థత!”

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు