Homeతెలంగాణహయత్‌నగర్‌లో వైభవంగా గణనాథుడి శోభాయాత్ర

హయత్‌నగర్‌లో వైభవంగా గణనాథుడి శోభాయాత్ర

  • డ్రెస్ కోడ్‌తో ఆకట్టుకున్న కాలనీవాసులు

  • నృత్యాలు.. భక్తి నినాదాలతో మార్మోగిన వీధులు

  • ఘనంగా ముగిసిన వినాయక నవరాత్రి ఉత్సవాలు

  • అందరినీ సమన్వయం చేస్తూ ముందుండిన అధ్యక్షుడు ఐతగోని యాదగిరి గౌడ్

క్రైమ్ మిర్రర్, హయత్‌నగర్ : హయత్‌నగర్‌ డివిజన్ లోని సూర్యనగర్ కాలనీలో వినాయక నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా గణనాథుడి శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. సూర్యనగర్ కాలనీ ఈస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన నిమజ్జనోత్సవంలో కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి, ఐక్యతను చాటారు.

కాలనీ అధ్యక్షుడు ఐతగోని యాదగిరి గౌడ్ ఉత్సవాల నిర్వహణలో అసోసియేషన్ సభ్యులు, మహిళలు, యువత, కాలనీవాసులను సమన్వయం చేస్తూ ముందుండి కార్యక్రమాన్ని నడిపించారు. నవరాత్రి ఉత్సవాల నుంచి నిమజ్జన శోభాయాత్ర వరకు ఏర్పాట్లను సభ్యులతో కలిసి పర్యవేక్షిస్తూ వేడుకలు సజావుగా జరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

శోభాయాత్రలో కాలనీవాసులు ఒకే రకమైన డ్రెస్ కోడ్‌తో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళలు, యువత, చిన్నారులు భక్తిగీతాలకు నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా ముందుకు సాగారు. ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలతో కాలనీ వీధులు మార్మోగాయి.
గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తిగీతాలు, నృత్య ప్రదర్శనల నడుమ విగ్రహాన్ని ఊరేగించి భక్తిశ్రద్ధలతో నిమజ్జనం నిర్వహించారు.

కార్యక్రమంలో అధ్యక్షుడు ఐతగోని యాదగిరి గౌడ్, యాదగిరి రెడ్డి, దశరథ రెడ్డి, రాజవర్ధన్ రెడ్డి, బీరప్ప, యాదగిరి ఆచారి, అమృత రెడ్డి, మల్లేష్‌తో పాటు అసోసియేషన్ సభ్యులు, కాలనీ పెద్దలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు