Homeఆంధ్ర ప్రదేశ్విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన.. పోక్సో కేసు నమోదు

విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన.. పోక్సో కేసు నమోదు

క్రైమ్ మిర్రర్ : విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి, మంచి మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయుడే వివాదంలో చిక్కుకున్నాడు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు రావడంతో ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ఆర్ కడప జిల్లాలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదైంది.

వివరాల్లోకి వెళ్తే.. నరసింహారెడ్డి అనే గణిత ఉపాధ్యాయుడు ఊటుకూరు వీరయ్య ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఆయన విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంతో విసిగిపోయిన ఓ విద్యార్థిని ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు ఉపాధ్యాయుడు నరసింహారెడ్డిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు ఈ ఆరోపణల నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు ఇప్పటికే సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు సమాచారం.
also read : ట్రోలింగ్ పై రష్మిక మందన్న ఆగ్రహం .. కుటుంబ సభ్యుల జోలికొస్తే ఊరుకోనంటూ వార్నింగ్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు