క్రైమ్ మిర్రర్ : దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మోతీ నగర్‌లోని ఓ దుస్తుల దుకాణంలో పనిచేస్తున్న 18 ఏళ్ల యువతి షబ్నమ్ హత్యకు గురైంది. శనివారం రాత్రి షాపు మూసే సమయంలో ఆమెకు పరిచయమున్న సూరజ్ అక్కడికి వచ్చాడు. మాట్లాడాలంటూ ఆమెను ట్రయల్ రూమ్‌లోకి తీసుకెళ్లి, వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
కొద్దిసేపటి తర్వాత ట్రయల్ రూమ్ నుంచి రక్తం బయటకు రావడాన్ని గమనించిన సిబ్బంది తలుపు తెరిచి చూడగా షబ్నమ్ విగతజీవిగా కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
దుకాణంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు సూరజ్‌పై అనుమానం వ్యక్తం చేశారు. గతంలోనూ అతడు షబ్నమ్‌పై దాడికి పాల్పడినట్లు ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. హత్య అనంతరం పరారైన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read : రైలు పట్టాల పేలుడు కేసులో ఇద్దరి అరెస్ట్
