క్రైమ్ మిర్రర్, సినిమా:- నేషనల్ క్రష్ రష్మిక మందన్న టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగిన సంగతి తెలిసిందే. అయితే ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టే సమయంలో జరిగిన ఆసక్తికర విషయాలను డైరెక్టర్ వెంకీ కుడుముల తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. రష్మిక కెరీర్ ప్రారంభ రోజులకు సంబంధించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కన్నడలో విడుదలైన బ్లాక్బస్టర్ సినిమా ‘కిరిక్ పార్టీ’ చూసిన తర్వాత, తన దర్శకత్వంలో తెరకెక్కిన ‘చలో’ సినిమా కోసం రష్మికను సంప్రదించినట్లు డైరెక్టర్ వెల్లడించారు. అయితే, కన్నడ పరిశ్రమ నుంచి నేరుగా వేరే ఇండస్ట్రీకి వచ్చి నటించడానికి మొదట్లో రష్మిక కాస్త సంకోచించారని, తెలుగులో నటించడానికి తొలుత ఆమె అస్సలు ఒప్పుకోలేదని తెలిపారు. ఇతర భాషా చిత్రాల్లో నటిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఆమె ఆఫర్ను స్వీకరించడానికి వెనకంజ వేసినట్లు చెప్పారు.
దీంతో తాము ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి, వారికి నచ్చజెప్పి ఒప్పించాల్సి వచ్చిందని వెంకీ కుడుముల గుర్తుచేసుకున్నారు. వారిద్దరి అంగీకారంతోనే రష్మిక టాలీవుడ్ ఎంట్రీ ఖరారైందని తెలిపారు. ఆ సమయంలోనే రష్మిక భవిష్యత్తులో టాలీవుడ్లో ‘నెక్స్ట్ బిగ్ థింగ్’ అవుతుందని తాను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. డైరెక్టర్ చెప్పిన ఈ ఆసక్తికర విశేషాలు ప్రస్తుతం రష్మిక అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
విజయసాయి రెడ్డిపై కేఏ పాల్ సంచలన ఆరోపణలు.. బీజేపీ పంపిన ఏజెంట్ అంటూ తీవ్ర విమర్శలు!
