Homeసినిమాపవన్ కల్యాణ్, అన్నా లెజినోవా విడాకుల వేళ... రేణూ దేశాయ్ పోస్ట్ నెట్టింట వైరల్!

పవన్ కల్యాణ్, అన్నా లెజినోవా విడాకుల వేళ… రేణూ దేశాయ్ పోస్ట్ నెట్టింట వైరల్!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, అన్నా లెజినోవా విడాకుల వ్యవహారంపై సోషల్ మీడియాలో చర్చలు కొనసాగుతున్న వేళ.. నటి రేణూ దేశాయ్ చేసిన తాజా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఈ అంశంపై నెట్టింట వివిధ రకాల ఊహాగానాలు, విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆమె చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్‌గా మారింది.

తన పోస్టులో రేణూ దేశాయ్ ఎవరి పేరునూ ప్రస్తావించకుండా.. ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు వారిని మరింతగా విమర్శించడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్నవారిని మరింత బాధపెట్టడం అమానవీయమని పేర్కొన్నారు. వ్యక్తి ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ, అతడూ సాధారణ మనిషేనని గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరికీ కుటుంబం, బంధాలు, భావోద్వేగాలు ఉంటాయని గుర్తుచేశారు.

ఇతరుల వ్యక్తిగత జీవితాలపై తీర్పులు చెప్పేవారిని ఉద్దేశించి కూడా ఆమె స్పందించారు. మన జీవితాల్లోనూ ఎన్నో లోపాలు ఉన్నప్పుడు ఇతరుల కుటుంబ వ్యవహారాలపై రాళ్లు విసరడం తగదని హితవు పలికారు. మనిషిగా గుర్తింపు పొందాలంటే దయ, జాలి, సానుభూతి వంటి లక్షణాలు ఉండాలని పేర్కొన్నారు.

అంతేకాకుండా తన వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని కొత్త ప్రచారాలకు తెరలేపవద్దని రేణూ దేశాయ్ స్పష్టం చేశారు. తాను చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు లేవని, ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా పరిస్థితులను అర్థం చేసుకుని స్పందిస్తున్నానని పేర్కొన్నారు. సమాజం మరింత పరిణతితో ఆలోచించాలని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన సమయంలో రేణూ దేశాయ్ చేసిన ఈ పోస్ట్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమె ఎవరినీ నేరుగా ఉద్దేశించకపోయినా, ఈ వ్యాఖ్యలు ప్రస్తుత పరిణామాలకు సంబంధించినవేనంటూ పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

also read: రియల్ ఎస్టేట్‌లో నష్టాలు.. ఆర్థిక ఇబ్బందులతో వ్యాపారి ఆత్మహత్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు