Homeక్రైమ్కొబ్బరి బోండాల మాటున పశువుల అక్రమ రవాణా.. మహబూబాబాద్‌లో 8 మూగజీవాలకు విముక్తి!

కొబ్బరి బోండాల మాటున పశువుల అక్రమ రవాణా.. మహబూబాబాద్‌లో 8 మూగజీవాలకు విముక్తి!

ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు సాగుతున్న పశువుల అక్రమ రవాణాను తెలంగాణలోని మహబూబాబాద్ పోలీసులు అడ్డుకున్నారు. కొబ్బరి బోండాల లోడ్‌తో వెళ్తున్న వాహనంలోనే పశువులను దాచిపెట్టి తరలిస్తున్న నిందితుల వ్యవహారాన్ని పోలీసులు బయటపెట్టారు.

వివరాల్లోకి వెళ్తే.. కొబ్బరి బోండాలు తరలిస్తున్న వాహనంలో అనుమానాస్పదంగా ఏదో జరుగుతోందన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో వాహనం లోపల పరిశీలించగా, కొబ్బరి బోండాల మధ్యలో ఎనిమిది పశువులను బంధించి తరలిస్తున్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే పశువులను బయటకు తీసి రక్షించారు.

మరోవైపు, సదరు వాహనానికి నంబర్ ప్లేట్ కూడా లేకపోవడం పోలీసులకు మరిన్ని అనుమానాలు కలిగించింది. ఈ ఘటనకు సంబంధించి అనకాపల్లికి చెందిన గొర్ల శివ, యలమచిలి శివ, బంగారి లచ్చన్నలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టారు.

ఈ అక్రమ రవాణా వెనుక ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

also read:  ఆసియా గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్‌కు భారీ మోసం.. రూ.69 లక్షలు కాజేసిన వ్యాపారి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు