ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన వెలుగుచూసింది. కొత్తపట్నం బీచ్ తీరానికి గురువారం ఉదయం ఓ బోటు కొట్టుకొచ్చింది. అందులో నాలుగు మృతదేహాలు కనిపించడంతో స్థానికంగా తీవ్ర కలకలం నెలకొంది.
స్థానికుల నుంచి అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. తీరానికి చేరుకున్న బోటు చెన్నైకి చెందినదిగా భావిస్తున్నారు. ఇందులో మొత్తం 15 మంది మత్స్యకారులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. సముద్రంలో అలల ఉధృతి కారణంగా బోటు అదుపుతప్పి దారి మళ్లి తీరానికి చేరి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
అయితే బోటులో ఉన్న మిగిలిన మత్స్యకారుల పరిస్థితి ఏమిటనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి అధికారిక వివరాలు ఇంకా వెల్లడికాలేదు. బోటు ఎక్కడి నుంచి బయలుదేరింది? సముద్రంలో ఏం జరిగింది? మిగిలిన వారి ఆచూకీ ఏమిటి? అనే విషయాలు తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
also read: ఒలింపిక్ స్వర్ణ పతకాన్నీ వదల్లేదు.. హాకీ దిగ్గజం ఇంట్లో భారీ చోరీ!
