ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తమ వినియోగదారుల కోసం సరికొత్త, అత్యంత చౌకైన డేటా ప్యాక్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ. 15 ధరలోనే అపరిమిత (అన్‌లిమిటెడ్) హై-స్పీడ్ 5G డేటా ప్యాక్‌ను జియో ప్రవేశపెట్టింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ డేటా కోరుకునే యూజర్లకు ఇది ఒక గొప్ప ఉపశమనంగా మారింది. ఈ ప్రత్యేకమైన డేటా ప్యాక్ వాలిడిటీ రీఛార్జ్ చేసిన సమయం నుండి 24 గంటల పాటు అందుబాటులో ఉంటుంది. అయితే, ఇది కేవలం డేటా ఆఫర్ మాత్రమే కావడంతో ఇందులో ఎలాంటి ఉచిత వాయిస్ కాల్స్ లేదా SMS సౌకర్యాలు లభించవు. వినియోగదారులు రూ. 15 తో రీఛార్జ్ చేసుకున్న తర్వాత 24 గంటల పాటు ఎంత డేటానైనా నిరభ్యంతరంగా వినియోగించుకోవచ్చు.
రికార్డుల వేటగాడు, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ బర్త్డే స్పెషల్!
ముఖ్యంగా ఆన్‌లైన్‌లో సినిమాలు చూడేవారు, హెచ్‌డీ వీడియోలు స్ట్రీమ్ చేసేవారు, ఆన్‌లైన్ గేమింగ్ ప్రియులు మరియు పెద్ద ఫైళ్లను డౌన్‌లోడ్ చేసుకునే వారికి ఈ ప్యాక్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా, ఈ ప్యాక్‌లోని డేటాను మొబైల్ హాట్‌స్పాట్ ద్వారా ల్యాప్‌టాప్‌లు, టాబ్‌లు లేదా ఇతర పరికరాలకు కనెక్ట్ చేసుకుని కూడా వాడుకునే వెసులుబాటు ఉంది.మరోవైపు, డేటా అవసరం లేకుండా కేవలం కాలింగ్ మాత్రమే కావాలనుకునే వారి కోసం జియో ఇప్పటికే రూ. 147 ధరకే ‘వాయిస్ ఓన్లీ’ ప్లాన్‌ను కూడా అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. వినియోగదారుల విభిన్న అవసరాలకు అనుగుణంగా జియో తీసుకొస్తున్న ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్లు మార్కెట్‌లో మంచి ఆదరణ పొందుతున్నాయి.
