Homeక్రైమ్కస్తూర్బా పాఠశాల విద్యార్థిని మృతి.. నలుగురు ఉద్యోగులపై వేటు

కస్తూర్బా పాఠశాల విద్యార్థిని మృతి.. నలుగురు ఉద్యోగులపై వేటు

క్రైమ్ మిర్రర్ :  సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్ గ్రామంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని మృతి చెందిన ఘటనలో విద్యాశాఖ అధికారులు కీలక చర్యలు తీసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణల నేపథ్యంలో పాఠశాలకు చెందిన నలుగురు ఉద్యోగుల కాంట్రాక్టు సేవలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

తొగుట మండలం గుడికందుల గ్రామానికి చెందిన దావులగల్ల లాస్య (15) రాఘవపూర్ కస్తూర్బా పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. దసరా సెలవుల అనంతరం తిరిగి హాస్టల్‌కు చేరుకున్న ఆమె అక్టోబర్ 28వ తేదీ రాత్రి అస్వస్థతకు గురైనట్లు పాఠశాల సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మరుసటి రోజు తెల్లవారుజామున 5 గంటల సమయంలో తల్లిదండ్రులు హాస్టల్‌కు చేరుకోగా, లాస్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సిబ్బంది తెలిపారు. అనంతరం ఆమెను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు తెలిసింది.

విద్యార్థిని మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన తల్లిదండ్రులు, ఘటనకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపించాలని అధికారులను కోరారు. దీంతో విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. విచారణ అనంతరం పాఠశాల స్పెషల్ ఆఫీసర్ హేమలత, ఏఎన్ఎం కవిత, ఉపాధ్యాయులు స్వప్న, మంజుల కాంట్రాక్టు సేవలను రద్దు చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి సి. రమేశ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని రూరల్ మండల ఎంఈఓ కొత్త రాజిరెడ్డి వెల్లడించారు.
also read : ఎంపీడీఓపై మూకుమ్మడి సెలవుల రాజకీయం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు