Homeతెలంగాణప్రభుత్వ పాఠశాలలకు మంచు లక్ష్మి అండ.. 48 స్కూళ్లను దత్తత తీసుకున్న 'టీచ్ ఫర్ చేంజ్'!

ప్రభుత్వ పాఠశాలలకు మంచు లక్ష్మి అండ.. 48 స్కూళ్లను దత్తత తీసుకున్న ‘టీచ్ ఫర్ చేంజ్’!

ప్రముఖ నటి, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే మంచు లక్ష్మి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థులకు సైతం కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో ఆమె ముందడుగు వేశారు. ఇందులో భాగంగా తన ఆధ్వర్యంలోని ‘టీచ్ ఫర్ చేంజ్’ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని 48 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా మంచు లక్ష్మి సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. చౌటకూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించి, అక్కడ సంస్థ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన డిజిటల్ స్మార్ట్ క్లాస్‌రూమ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించిన ఆమె.. గ్రామీణ ప్రాంతాల పిల్లలకు ఆధునిక విద్యా సౌకర్యాలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు.

దత్తత తీసుకున్న పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పెంచేలా స్మార్ట్ ఎల్‌ఈడీ టీవీలు, డిజిటల్ బోధనా సదుపాయాలు, అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నట్లు మంచు లక్ష్మి వివరించారు. సాంకేతికతను విద్యతో అనుసంధానం చేయడం ద్వారా విద్యార్థులకు మెరుగైన అభ్యాస అవకాశాలు కల్పించవచ్చని పేర్కొన్నారు.

విద్యార్థుల భవిష్యత్తుకు నాణ్యమైన విద్య ఎంతో కీలకమని, ప్రభుత్వ పాఠశాలల్లోనూ మెరుగైన విద్యా ప్రమాణాలు అందుబాటులో ఉండాలని ఆమె ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల పిల్లలకు సమాన అవకాశాలు కల్పించేందుకు ‘టీచ్ ఫర్ చేంజ్’ ద్వారా తమ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని మంచు లక్ష్మి స్పష్టం చేశారు.

also read: తెలంగాణ ఉద్యమకారుడి విషాదాంతం.. అప్పుల బాధతో పీఏసీఎస్ డైరెక్టర్ ఆత్మహత్య!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు