-
పార్టీ గుర్తును కోల్పోయి ప్రమాదంలో మమతా బెనర్జీ
-
ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం
-
పని చేయని చరిష్మ
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: బెంగాల్ రాజకీయాల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని చలాయిస్తూ వచ్చారు మమతా బెనర్జీ. దాదాపు దశాబ్దన్నర కాలం తన కనుసైగలతో బెంగాల్ రాజకీయాన్ని శాసించారు. అటువంటి ఆమె ఇప్పుడు రాజకీయంగా సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు.
పెద్ద రాజకీయ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తృణమూల్ కాంగ్రెస్ పేరును, జంట పువ్వులు- గడ్డి గుర్తు స్తంభింపజేయడం మమతా శిబిరానికి చావు దెబ్బగా మారింది.
మమత అంటేనే తృణమూల్.. తృణమూల్ అంటేనే మమత అన్న నినాదంతో ఎన్నాళ్లు ఏకఛత్రాధిపత్యం సాగించారు దీదీ. గుర్తింపు కోల్పోయిన స్థితిలో జరిగిన తాజా నందిగ్రామ్, రెజీనగర్ బై పోల్ లో కనీసం ప్రభావం చూపలేక చేతులెత్తేసారు.
-
గట్టెక్కని కాంగ్రెస్..
నందిగ్రామ్ లో కనీస ప్రభావం చూపలేకపోయారు మమత. 2021 ఎన్నికల్లో సువేందూ అధికారి చేతిలో ఎదురైన చేదు పరాభవం తర్వాత.. అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన నందిగ్రామ్ లో మమతా తీసుకున్న నిర్ణయం ఆమె వర్గానికి తీరని పరాభవాన్ని మిగిల్చింది.
పార్టీ గుర్తు లేకపోవడంతో వ్యూహాత్మకంగా కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్ కు మమతా బహిరంగ మద్దతు ప్రకటించారు. కానీ బిజెపి అభ్యర్థి హాసి రాణి రథ్ ఏకంగా 1.64 లక్షలకు పైగా ఓట్లు సాధించారు. 1.22 లక్షల భారీ మెజారిటీతో తిరుగులేని విజయం సాధించారు.
మమత ఆశీస్సులు ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి కేవలం 41 వేల ఓట్లకు మాత్రమే పరిమితమయ్యారు. మమత మద్దతుతో కొంతవరకు గట్టెక్కవచ్చు అని భావించిన కాంగ్రెస్ కు ఘోర పరాభవం ఎదురయింది.
-
ఆదరించని ముస్లింలు..
ముర్షిదాబాద్ జిల్లాలోని ముస్లిం మెజారిటీ నియోజకవర్గం రేజీ నగర్ లో పరిస్థితి మరింత దిగజారింది. ఇక్కడ మమతా బెనర్జీ వర్గం స్వతంత్ర అభ్యర్థిగా తమ ప్రతినిధిని బరిలో దింపింది. కానీ పట్టుమని ఐదు ఆరువేల ఓట్లు కూడా సాధించలేక డిపాజిట్లు గల్లంతయ్యాయి.
గతంలో మమత కు అండగా నిలిచిన సంప్రదాయ మైనారిటీ ఓటు బ్యాంకు.. ఆమె వెనుక కాకుండా స్థానిక ప్రత్యామ్నాయాల వైపు పూర్తిగా మళ్లీ పోవడం.. బెంగాల్ రాజకీయాల్లో వస్తున్న గుణాత్మక మార్పునకు నిదర్శనం.
బిజెపి రెండు స్థానాలను క్లీన్ స్వీప్ చేయడమే కాకుండా.. మైనారిటీ ప్రాబల్య ప్రాంతాల్లోనూ మమత ప్రభంజనం సున్నాగా మారింది. దీంతో బెంగాల్లో మమతా బెనర్జీ రాజకీయానికి కాలం చెల్లినట్టే.
