Homeఅంతర్జాతీయంప‌నామాలో భారీ భూకంపం...! ప‌రుగులు తీసిన ప్ర‌జ‌లు...

ప‌నామాలో భారీ భూకంపం…! ప‌రుగులు తీసిన ప్ర‌జ‌లు…

ఢిల్లీ, క్రైమ్‌మిర్ర‌ర్‌: ప‌నామా దేశంలో శుక్ర‌వారం భారీ భూకంపం సంభ‌వించింది. దేశ ద‌క్షిణ తీర ప్రాంత‌లో 7.6 తీవ్ర‌త‌తో శ‌క్తివంత‌మైన భూకంపం సంభ‌వించింది. ఈ దేశం ఉత్త‌ర‌- ద‌క్షిణ అమెరికాల మ‌ధ్య గ‌ణ‌తంత్ర దేశం. కాగా ఈ భారీ భూకంప దాటికి ప్ర‌జ‌లు కార్యాల‌యాల నుంచి ప‌రుగులు తీశారు. కాగా వెంట‌నే అధికారులు ప‌సిఫిక్ తీర ప్రాంతాల‌కు సునామి హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌గా ఆ త‌రువాత ప్ర‌మాదం త‌ప్పింద‌ని నిర్ధారించి సునామీ హెచ్చ‌రిక‌ల‌ను ఉప‌సంహ‌రించుకున్నారు.

అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం.. పిటలోజా అరిబా సమీపంలో భూమికి కేవలం 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భూకంప తీవ్రతను తొలుత 8.0 గా అంచనా వేశారు. కానీ ఆ తర్వాత 7.6 కు సవరించారు. ఈ భూకంపం ధాటికి పనామా నగరంలోని భ‌వ‌నాలు కంపించాయి. పొరుగున ఉన్న కోస్టారికా దేశ‌ రాజధానిలోనూ భూప్ర‌కంప‌న‌లు చోటుచేసుకున్నాయి.భయంతో ప్రజలు ఇళ్ల నుంచి కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. పెనోనోమే నగరంలోని ఒక కేథడ్రల్ టవర్ లిపోయిందని, మరికొన్ని నిర్మాణాలకు నష్టం వాటిల్లిందని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భూకంపం సంభవించిన వెంటనే యూఎస్ సునామీ వార్నింగ్ సిస్టమ్ పనామా, కొలంబియా, ఈక్వడార్ సహా మధ్య అమెరికా పసిఫిక్ తీరాలకు సునామీ హెచ్చరికలు జారీచేసింది.

కొన్ని చోట్ల 1 నుంచి 3 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసిపడవచ్చని అంచనా వేసింది. అయితే కొంతసేపటి తర్వాత పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ పరిస్థితిని సమీక్షించి, పెద్ద ప్రమాదం ఏమీ లేదని ప్రకటించింది. దాంతో సునామీ హెచ్చరికలను ఎత్తివేశారు. ప్రధాన భూకంపం తర్వాత 6.6 తీవ్రతతో సహా పలుమార్లు భూమి కంపించింది. ఈ ఘటనలో ప్రాణనష్టంపై వెంటనే స్పష్టత రాలేదని, కొందరికి గాయాల‌య్యాయ‌ని స్థానిక అధికారులు తెలిపారు.ప్రజలు సంయమనం పాటించాలని పనామా అధ్యక్షుడు జోస్ రాఉల్ ములినో కోరారు. పనామా కెనాల్ కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతున్నాయని అధికారులు చెప్పారు. ప్రస్తుతం అధికారులు నష్టాన్ని అంచనావేసే పనిలో ఉన్నారు.

 

ఇవి కూడ చ‌ద‌వండి:
  1.  అరోరా కాలేజీలో ఏం జ‌రుగుతోంది…! కాలేజీ హాస్ట‌ల్ విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు క‌ల‌క‌లం…
  2. ఇద్ద‌రు విద్యార్థినుల అదృశ్యం…! శంషాబాద్‌లో క‌ల‌క‌లం…
  3. వీడియో: భర్త బైక్‌ పార్క్‌ చేసేలోపే.. లవర్‌తో భార్య జంప్‌
  4.  సంగారెడ్డిలో విషాదం: బట్టలు ఉతికేందుకు వెళ్లి.. ముగ్గురూ మృత్యుఒడికి..!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు