Homeక్రీడలుస్టేడియంలో అనుష్క ఉంటే కోహ్లీ చెలరేగేవాడు: ఆసక్తికర విషయాలు పంచుకున్న రవిశాస్త్రి

స్టేడియంలో అనుష్క ఉంటే కోహ్లీ చెలరేగేవాడు: ఆసక్తికర విషయాలు పంచుకున్న రవిశాస్త్రి

క్రైమ్ మిర్రర్,స్పోర్ట్స్:- టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఇటీవల ఒక షోలో మాట్లాడుతూ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మల డేటింగ్ రోజుల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను ప్రస్తావించారు. ఆ సమయంలో కోహ్లీ ఆటతీరుపై అనుష్క ప్రభావం ఎంత సానుకూలంగా ఉండేదో ఆయన వివరించారు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అనుష్క శర్మ స్టాండ్స్‌లో ఉంటే, కోహ్లీ మైదానంలో అద్భుతంగా ఆడేవాడని రవిశాస్త్రి గుర్తుచేసుకున్నారు. ఆమె మద్దతుతో ఆ టైమ్‌లో అతడి పెర్ఫార్మెన్స్ గణనీయంగా ఇంప్రూవ్ అయిందని ఆయన పేర్కొన్నారు.

దీనికి ఉదాహరణగా ఒక సందర్భాన్ని ప్రస్తావిస్తూ.. అనుష్క స్టేడియంలో ఉన్న ఒక మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఏకంగా 160 పరుగులు కొట్టి సత్తా చాటాడని ఆయన గుర్తుచేసుకున్నారు. ఆటగాళ్ల మానసిక స్థితిపై వారి భాగస్వాముల ప్రభావం ఎలా ఉంటుందనడానికి ఇదే ఒక మంచి ఉదాహరణ అని ఆయన అన్నారు.ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని క్రికెట్ మేనేజ్‌మెంట్‌కు ఆయన ఒక కీలక సూచన చేశారు. సుదీర్ఘమైన క్రికెట్ టూర్లకు వెళ్లేటప్పుడు ప్లేయర్లతో పాటు వారి భార్యలను లేదా గర్ల్‌ఫ్రెండ్స్‌ను కూడా వెంట తీసుకెళ్లేందుకు మేనేజ్‌మెంట్ తప్పనిసరిగా అనుమతించాలని రవిశాస్త్రి తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలా చేయడం వల్ల ఆటగాళ్లు మరింత మెరుగ్గా రాణించే అవకాశం ఉంటుందని ఆయన పరోక్షంగా స్పష్టం చేశారు.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి: నోటిఫికేషన్ తేదీలు, నిర్వహణపై సీఎం కీలక అప్‌డేట్

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు